కరోనా మహమ్మారి కాటుతో ప్రపంచమే విలవిల్లాడుతోంది. అందులో కొన్ని దేశాల పరిస్థితి మరీ భయంకరంగా ఉంది. అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల్లో కరోనా మారణ హోమమే సృష్టిస్తోంది. అక్కడి దయనీయ గాధలు వింటే కరడు గట్టిన హృదయానికైనా కన్నీరు తప్పదన్నట్టుగా ఉంది.

 

 

ప్రత్యేకించి ఫ్రాన్స్‌లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇక్కడ ఎంత దారుణం అంటే.. కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి శవపేటికలను ఉంచేందుకు పారిస్‌లో చోటు దొరకడం లేదు. ఇప్పటికే ఈ శవ పేటికలు గుట్టల్లా పేరుకుపోయాయి. అంతే కాదు.. భవిష్యత్తులో ఇంకా శవ పేటికలు వస్తాయి. వాటిని పూడ్చేందుకు మనుషులు కుడా కరవవుతున్నారు.

 

 

వీటికి ఎక్కడ పెట్టాలో తెలియక.. స్మశానాలు నిండిపోయిన పరిస్థితుల్లో పారిస్ నగరంలోని భారీ ఫుడ్‌ మార్కెట్‌ రంజిస్‌లోని హాలును స్వాధీనం చేసుకున్నట్టు పారిస్ పోలీసులు ప్రకటించారు. ఫ్రాన్స్ లో పరిస్థితి ఇంత దారుణంగా మొదట్లో లేకపోయినా.. రాను రాను మరింత దయనీయంగా మారుతోంది. యూరప్‌లోనే అతి దారుణంగా ఎఫెక్ట్ అయిన దేశాల్లో ఇటలీ, స్పెయిన్ తరువాతి స్థాయిలో ఫ్రాన్స్ ఉంది.

 

 

మిగిలిన దేశాలతో పోలిస్తే ఫ్రాన్స్ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ దేశంలో కేసుల సంఖ్య కాస్త తక్కువే అయినా మరణాల సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ ఫ్రాన్స్ లో 60 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ కరోనా తో మరణించిన వారి సంఖ్య మాత్రం 5 వేలు దాటింది. ఇంత కంటే ఎక్కువ కేసులు నమోదైన చైనాలోనూ ఇన్ని మరణాలు మాత్రం లేవు. కరోనా కట్టడిలో విఫలం కావడం, ఈ దేశస్థుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం కారణాలు కావచ్చు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: