క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాలు వ్యాప్తిచెంది.. ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇక కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాల‌లు కూడా బంద్ అయిన సంగ‌తి తెలిసిందే. జనసందోహం ఉండే ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి వేగవంతంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం విద్యా సంస్థల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో అన్ని సెలవులు పోగా కనీసంగా 220 పనిదినాలు పాఠశాలలు, కాలేజీలు పనిచేయాలి.

 

కాని, ఇటీవ‌ల‌ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలు, స్కూళ్లన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండో శనివారాల్లో పని చేసేలా షెడ్యూల్‌ జారీ చేసింది. అయితే ఇప్పుడు కరోనా మ‌హ‌మ్మారి కొత్త సమస్య సృష్టించింది. దీంతో ఈసారి నిర్దేశిత పని దినాలు లేకుండా ఈ విద్యా సంవత్సరం ముగియనుంది. వాస్తవానికి ఏప్రిల్‌ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినం. కాని, క‌రోనా కార‌ణంగా 40 రోజుల ముందుగానే విద్యా సంస్థలు, స్కూళ్లన్నీ మూతపడ్డాయి. వచ్చేది వేసవి కాబట్టి ఆ 40 రోజులు పాఠశాలలను నిర్వహిద్దామన్నా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై విద్యాశాఖలో స్పష్టత లేకుండా పోయింది. 

 

ఈ క్ర‌మంలోనే కే ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఆటోమేటిక్‌గా పాస్‌ చేసి పైతరగతికి పంపించాలని భావిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇంకా జారీ చేయలేదు. మ‌రోవైపు 10వ త‌ర‌గితి ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. అవి ఎప్పుడు జ‌రుగుతాయో అర్థంకాని ప‌రిస్థితి. ఏదేమైనా కరోనా ప్రభావం ఈ నెలంతా ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మ‌రియు మే నెలలో సైతం ఆ ప్రభావం ఉండవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే జూన్‌ 1న వేసవి సెలవులు ముగిసి, తిరిగి  బడులు ప్రారంభం కావడం కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

applehttps://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: