ఇప్పుడు కృష్ణా జిల్లాలో కరోనా దెబ్బకు ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. కరోనా దెబ్బకు ఎవరూ కూడా నిద్రపోయే పరిస్థితులు జిల్లాలో కనపడటం లేదు. కరోనా వైరస్ ప్రభావం మా జిల్లాకు అంతగా ఉండే అవకాశం లేదని భావించిన కృష్ణా జిల్లాకు అది చుక్కలు చూపిస్తుంది. ఊహించని విధంగా కరోనా వైరస్ జిల్లాలో విస్తరించింది. ఇది గ్రామ స్థాయిలోకి కూడా జిల్లాలో వెళ్ళింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

జగ్గయపేట నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ముప్పాళ్ళ అనే గ్రామంలో కరోనా భయం మొదలయింది. జగ్గయపేట పేటలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. రెండు పాజిటివ్ గా రావడంతో జిల్లాలో అలజడి రేగింది. ఇక విజయవాడలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరగడంతో ప్రజలు ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు. కరోనా ఏ విధంగా కట్టడి అవుతుందో ప్రభుత్వానికి అర్ధం కావడం లేదు. 

 

జిల్లాలో ఢిల్లీ నుంచి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వారి నుంచే కరోనా ఎక్కువగా బయటపడుతుంది. వారి నుంచే వ్యాప్తి ఎక్కువగా ఉండటం వాళ్ళు కావాలనే బయటకు రాకపోవడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో, ప్రభుత్వంలో కరోనా ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మరి దీనిపై ఏ చర్యలు తీసుకుంటారు జిల్లాలో అనేది చూడాల్సిన అవసరం ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: