లోకమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే కొందరు ఏబ్రాసి వెధవలు మాత్రం కరోనా అడ్డుపెట్టుకుని ప్రజలకు, ప్రభుత్వాలకు టోపీ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.. ఇప్పటికే పేదలకు పంచే రేషన్ కోటా విషయంలో నికృష్టపు మనుషులు కొందరు డీలర్లుగా ఉన్నారు.. వీరు పందికొక్కుల్లా ఈ నిత్యావసర సరకుల్లో కోత మొదలెట్టారు.. అదీగాక ఇప్పుడు మరికొందరు సైబర్ నేరగాళ్లూ ఏకంగా కరోనా ఖజానాను కొల్లగొట్టడానికి రంగంలోకి దిగారు.. ఇకపోతే కేంద్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా పౌరులు విరాళాలు ఇచ్చేందుకు రూపొందించిన ప్రధానమంత్రి సహాయనిధి ఖాతాకు నకిలీ ఖాతా తయారుచేసి, సైబర్‌ దొంగలు అమాయకులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారట..

 

 

దొంగ వెధవలు వారి తెలివిని ఉపయోగించిన విధానాన్ని చూస్తే, అసలు ఖాతాను, నకిలీ ఖాతాను గుర్తుపట్టడం కష్టమంట.. కేవలం వారు ఈ నకిలీ ఐడీని ఒక అక్షరం తేడాతో సృష్టించినట్లు రెండురోజుల క్రితం దిల్లీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కనిపెట్టారట. వెంటనే అప్రమత్తమై అధికారులు ఆ నకిలీ ఐడీని బ్లాక్‌ చేశారని సమాచారం.. అదీగాక ఈ సైబర్‌ నేరగాళ్లు, పౌరులు అందించే విరాళాల కోసం కేంద్ర ప్రభుత్వం అధికారిక యూపీఐ ఐడీ గురించి ప్రచారం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే నకిలీని సృష్టించి నెట్‌లో ఉంచినట్లు వెల్లడైంది.

 

 

ఇదొక్కటే కాకుండా ఇలాంటివి అరడజను వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చే వారి కోసం ఎస్‌బీఐ బ్యాంకు, యూపీఐ ఐడీని రూపొందించింది. కాగా ఈ అధికారిక భీమ్‌ యూపీ ఐడీ  pmcares@sbi.. అని ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే సైబర్‌ దొంగలు pmcare@sbi  పేరిట నకిలీ యూపీఐ ఐడీని సృష్టించారు. ఇది చూడ్డానికి అసలు ఐడీనే పోలి ఉంటుంది.. కానీ పరీక్షించి చూస్తే అధికారిక ఐడీలో ఉన్న ‘ఎస్‌’ అక్షరం ఇందులో కనిపించదు.. కాబట్టి విరాళాలు ఇచ్చే దాతలు ‘ఎస్‌’ అక్షరం లేకుండా నమోదు చేసి డబ్బు పంపిస్తే సైబర్‌ దొంగల పరమైపోతుంది. కావున ఈ విషయంలో దాతలంతా అప్రమత్తంగా ఉండగలరని అధికారులు హెచ్చరిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: