చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా కరాళ నృత్యం చేస్తోంది. మూడు అక్ష‌రాలే అయినా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. క‌రోనా దెబ్బ‌కు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా కోరలు చాచింది. ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 50 వేలు దాటింది. గురువారం రాత్రి వరకు కోవిడ్ బారిన పడి 50,255 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పది లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకూ 9.81 లక్షల మందికి కోవిడ్ సోకింది.

 

ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సైతం క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 149కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌ రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 123 శాంపిల్స్‌ను పరీక్షించగా మొత్తం 11 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయినట్టుగా తెలిపారు. అందులో ముఖ్యంగా గుంటూరు, నెల్లూరు, కృష్ణ‌ జిల్లాలో అత్యధిక కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

 

నెల్లూరులో మొత్తం 24 క‌రోనా కేసులు న‌మోదు కాగా, కృష్ణ జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 20 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఈ మూడు జిల్లాలు టాప్ - 3లో నిలిచాయి. ఇక  వరుసగా కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంటోంది. కాగా, ఇప్పటివరకు తీసుకున్న నమూనాల్లో 1,321 నెగిటివ్‌ అని తేలాయని, మరో 409 కేసులకు సంబంధించి వైద్య నివేదికల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ గురువారం  విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇక రాబోయే రెండు రోజుల్లో ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏపీలో ఇప్పటి వరకు ఎవరూ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోలేదు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: