క‌రోనా వైర‌స్ యూర‌ప్‌తో పాటు ప్ర‌పంచాన్ని అత‌లా కుతులం చేయ‌డంతో పాటు నిమిషం నిమ‌షానికి కొన్ని వేల‌మందికి సోకుతూ ఉండ‌డంతో పాటు యూర‌ప్ దేశాల్లో స‌గ‌టున రోజుకు 1000 మందికి పైగా చ‌నిపోతోన్న ప‌రిస్థితి వ‌చ్చేసింది. మ‌న‌దేశంలో కూడా క‌రోనా మ‌ర‌ణాలు 50 దాట‌గా.. క‌రోనా బాధితులు 2500కు చేరుకున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ విష‌యానికి వ‌స్తే రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల ఉధృతి కొనసాగుతోంది. బుధవారం అర్ధరాత్రికి రాష్ట్రంలో 111 పాజిటివ్‌ కేసులు ఉండగా ఆ సంఖ్య గురువారానికి 149కు చేరింది. గురువారం ఒక్కరోజే 38 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసుల్లో ఢిల్లీ నుంచి వచ్చిన వారివే ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

 

ఇక తెలంగాణ‌లో గురువారం మరో 27 మందికి ఈ వైరస్ సోక‌గా మొత్తం కేసుల సంఖ్య 154కి చేరింది. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. బుధవారంనాటికి 14 మంది డిశ్చార్జి కాగా, గురువారం మరో ముగ్గురు డిశ్చార్జి అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా నుంచి కోలుకుని 17 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 128 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

 

ప్ర‌పంచ వ్యాప్తంగా శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 15, 728

మృతుల సంఖ్య - 53, 202

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 2, 12, 991

యాక్టివ్ కేసుల సంఖ్య - 7, 49, 535

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 66, 193

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 2, 45, 088 - 6075

ఇట‌లీ - 1, 15, 242 - 13, 915

స్పెయిన్ - 1, 12, 065 - 10, 348
 

 

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 2543

మృతులు - 72

తెలంగాణ‌లో కేసులు - 154

గురువారం కేసులు - 27

తెలంగాణ మృతులు - 9

తెలంగాణ‌లో డిశ్చార్జ్ - 17

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 149

హ‌య్య‌స్ట్ కేసులు ఉన్న జిల్లా - నెల్లూరు (24) 

కొత్త కేసులు - 38

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: