కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతూ వస్తోంది. ఇప్పటికే భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలను ఈ కరోనా మహమ్మారి వణికిస్తోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. మొదట్లో ఏపీలో దీని ప్రభావం తక్కువగా ఉన్నట్లుగానే కనిపించినా, ఆ తరువాత తరువాత మాత్రం దీని తీవ్రత పెరిగింది. దీనంతటికీ కారణం నిజాముద్దీన్ మత ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారివల్లే. ఈ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా అధికారులు ధృవీకరిస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ  కలకలం రేగుతోంది. అన్ని ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉండడంతో, వారి కారణంగా అన్ని రాష్ట్రాలకు ఈ కరోనా వైరస్ ప్రభావం గట్టిగా తగిలింది. 

 


ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఇళ్లకే పరిమితం కావాలని, రోడ్లపైకి వచ్చి అనవసరంగా కరోనా భారిన పడవద్దు అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ఈ వైరస్ ప్రభావాన్ని తేలిగ్గా తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్న కేసుల సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నా, దీనిని పూర్తిగా మన దేశం నుంచి తరిమి కొట్టాలంటే ప్రభుత్వం నిర్ణయించిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరు బాధ్యతతో పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరింత పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 

 


ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు రోడ్లపై వచ్చి యథేచ్ఛగా తిరుగుతున్నా, వారిని పోలీసులు దండిస్తున్నా, బహిరంగంగా శిక్ష విధిస్తున్నా, ఏదో ఒక మార్గంలో జనాలు రోడ్లపై తిరిగేందుకు ఆసక్తి చూపించడం ఆందోళన కలిగిస్తోంది. కనీసం ఈ రెండు వారాల పాటు ప్రజలు చిత్తశుద్ధితో పాటించి ఇళ్లకే పరిమితమైతే కరోనా ను మన దేశం నుంచి తరిమి వేసే అవకాశం ఉంటుంది. లేకపోతే అమెరికా, ఇటలీ తరహాలో ప్రాణ నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అదే జరిగితే భారతదేశంలో చాలా దారుణమైన పరిస్థితులు  ఏర్పడే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: