రాబోయే 5 రోజులు దేశానికి చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన వీడియో సందేశం ఒకటి ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 130 కోట్ల మంది ప్రజలు సంకల్ప శక్తిని చాటాలని మోడీ విజ్ఞప్తి చేసారు. ఏప్రిల్ 5 న ప్రజలు అందరూ సామాజిక దూరం పాటిస్తూ సాయంత్రం 9 గంటలకు లైట్స్ ఆపేయాలని ఆయన కోరారు. 9 నిమిషాల పాటు లైట్స్ ఆపేయాలని, 

 

లైట్స్ ఆపేసి దీపాలు వెలిగించాలని మోడీ విజ్ఞప్తి చేసారు. కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్స్ వేయాలని ఆయన కోరారు. ప్రజలు అందరూ కరోనా మీద ఐక్యంగా పోరాడాలి అని మోడీ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా సామాజిక దూరం పాటించాలని మోడీ అన్నారు. కరోనాపై యుద్దానికి ప్రజలు అందరూ బాగా సహకరిస్తున్నారని మోడీ కొనియాడారు. ఐక్యంగా పోరాడితేనే విజయం సాధిస్తామని అన్నారు. 

 

ఏప్రిల్ 5 న అందరూ కరోనా చీకట్లు తరిమివేయాలని అన్నారు. మనం అందరం లాక్ డౌన్ లో ఒంటరి కాదనే విషయాన్ని ఈ విధంగా చెప్పాలని, 9 నిమిషాల సమయం తనకు ఇవ్వాలని మోడీ కోరారు. ప్రజలు అందరూ కూడా సంకల్ప శక్తిని వెలిగించాలి అని మోడీ సూచించారు. కరోనాపై మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది అని మోడీ ఈ సందర్భంగా ప్రజలను అభినందించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: