కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి దేశప్రజల ముందు మరో బాధ్యతనుంచారు. ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిముషాల పాటు దేశంలోని ప్రజలందరు తమ ఇళ్ళల్లోని దీపాలను ఆర్పేయాలని పిలుపిచ్చారు. వైరస్ ను నియంత్రించటానికి దేశప్రజలు అందిస్తున్న సహకారం చాలా అద్భుతంగా ఉందన్నారు. వైరస్ నియంత్రణలో భాగంగా  లాక్ డౌన్ కు పిలుపిస్తే యావత్ దేశం స్పందించిన తీరుకు జనాలను ప్రధాని అభినందించారు.

 

అయితే 5వ తేదీన ఇళ్ళల్లో దీపాలను ఆర్పేయాలని చెప్పిన ప్రధానమంత్రి అందుకు కారణాన్ని మాత్రం చెప్పలేదు. దీపాలను ఆర్పేయాలంటే బహుశా చీకట్లలో నుండి వెలుగు దిశగా ప్రయాణించటం అని పరోక్షంగా చెప్పిందే కారణమేమో. ఏదేమైనా దేశమంతా లాక్ డౌన్ విషయంలో ప్రధానమంత్రి నిర్ణయం వైపు ఎదురు చూస్తోంది. ఇన్ని రోజుల పాటు దేశంలోని జనాలందరూ లాక్ డౌన్ లో భాగంగా ఎవరిళ్ళకు వాళ్ళు పరిమితమయ్యారంటే అందుకు వాళ్ళల్లోని ప్రాణభయమే కారణమని చెప్పాలి.

 

అయితే గడచిన కొద్ది రోజులుగా దేశప్రజలందరూ లాక్ డౌన్ ను పాటించి ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండిపోవటం బహుశా అందరికి ఇదే మొదటి అనుభవం. దాంతో కొందరు ఇబ్బందులు పడుతున్నా చాలామంది ఈ అనుభవాన్ని ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఇదే పరిస్ధితి ఇంకొద్ది రోజులు కంటిన్యు అయితే మాత్రం జనాలు తట్టుకోలేరన్నది కూడా వాస్తవం.

 

మరి ఈ పరిస్ధితుల్లో మోడి ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై యావత్ దేశంలో ఆసక్తిగా మారింది. ఎందుకంటే గురువారం ముఖ్యమంత్రులతో ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది. లాక్ డౌన్ విషయంలో జనాలు పడుతున్న ఇబ్బందులను చాలామంది సిఎంలు ప్రధాని దృష్టికి తెచ్చారు. అయితే లాక్ డౌన్ కు ప్రత్యామ్నాయాన్ని సూచించాలని ప్రధాని అడిగినపుడు సిఎంలు చెప్పలేకపోయారు. సరే రేపు ఆదివారం రాత్రి ప్రజలంతా చేయాల్సిన పనిని స్పష్టం చేశారు. కాబట్టి ఏప్రిల్ 14వ తేదీ గురించి వెయిట్ చేయాల్సిందే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: