క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజుకూ మహమ్మారి మరింత తీవ్రమవుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. ఈ లెక్క‌లు బ‌ట్టీ చూస్తుంటే క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఇందుకు భార‌త్ కూడా మిన‌హాయింపు కాదు. భార‌త్‌లోనూ క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

 

అయితే తాజాగా కరోనాపై పోరులో భారతజాతి మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ కరోనాపై యుద్ధం చేస్తున్న దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనాను నియంత్రించటానికి దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలిచారని కొనియాడారు. ఇక ఈ ఉదయం వీడియో సందేశాన్ని ఇచ్చిన ఆయన, ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం రాత్రి, 9 గంటల సమయంలో 9 నిమిషాల సమయాన్ని ప్రతి ఒక్కరూ కేటాయించాలని తెలిపారు.

 

ఇప్పటివరకూ 9 రోజుల పాటు విజయవంతంగా లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేశామని, మరో 11 రోజుల పాటు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఇక ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలోని అన్ని లైట్లనూ ఆర్పివేయాలని, ఆపై వీధుల్లోకి రాకుండా, తలుపుల వద్ద నిలబడి, దీపాలను, కవ్వోత్తులను వెలిగించాలని మోదీ కోరారు. అయితే ఈ సమయంలో వీధుల్లోకి మాత్రం ఎవరూ రావద్దని ఆయన కోరారు. తద్వారా జాతి సంకల్పం ఒకటేనన్న సందేశాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు.  ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 9న దీపాలు వెలిగించి, మన సంకల్పాన్ని ప్రపంచానికి చాటాలని ప్ర‌ధాని సూచించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: