ప్రపంచ వ్యాప్తంగా కరోన సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతా కాదు.  ఇప్పటికీ వెలల్లో మరణాలు.. లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.  ప్రస్తుత మన దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ అమల్లో ఉంది.  ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ఎప్పటికప్పుడు తగు సూచనలు.. ధైర్యం నింపుతున్నారు.  నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వారి కష్టసుఖాలు గురించి తెలుసుకున్నారు.  రాష్ట్రాలకు ఇంకా ఎలాంటి సహాయాన్ని అందించడానికైనా రెడీ అంటూ భరోసా ఇచ్చారు.  

 

ఆ మద్య ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి కరోనా పై యుద్దం అంటూ ‘జనతా కర్ఫ్యూ’ ని పాటించాలని సూచించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆ రోజు అందరూ ఇంటి పట్టున ఉన్నారు.  సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చి చప్పట్లతో సంఘీభావం తెలిపారు.  తాజాగా మరోసారి ప్రధాని మోదీ ప్రజలనుకు కరోనాపై యుద్దం చేయాలని.. అందుకోసం ఏప్రిల్ 5 న రాత్రి ప్రతి ఒక్కరూ రాత్రి 9.00 గంటలకు ఇంట్లోని అన్ని లైట్లు ఆపివేయాలని.. తొమ్మిది నిమిషాల పాటు కొవ్వొత్తి లేదా దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్ వేయాలని.. అప్పుడు ఎవరూ ఒంటరిగా లేమని ధైర్యం చెప్పుకోవాలన్నారు.  

 

 

ఈ సందర్బంగా ఎవరు బయటకు రాకుండా కేవలం ఇంట్లో కూర్చొని ఈ పని చేయాలని.. రోనాపై విజయానికి నాంధిగా దీనిని జరపాలని ఆయన ప్రజలను కోరారు.  జనతా కర్ఫ్యూని ఎంత దిగ్విజయం చేశారు.. ఇది కూడా అంతే గొప్పగా విజయం అయ్యేలా చూడాలని అన్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: