కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వీడియో సందేశం మరోసారి భారతీయుల్లో ఆత్మవిశ్వాసం నింపింది. కరోనాపై పోరులో భారత్ ప్రపంచానికే ఆదర్శమైందంటూ మోడీ చేసిన ప్రసంగం కొండంత ధైర్యాన్నిచ్చింది. ఓవైపు ప్రపంచం అంతా కరోనా విజృంభణతో వణికిపోతోంది. పిట్టల్లా రాలుతున్న జనంతో భయంతో వణికిపోతున్నాయి. ఇండియాలోనూ కేసులు సంఖ్య వేగంగా పెరుగుతోంది.

 

 

ఇలాంటి సమయంలో మోడీ ప్రసంగం కాస్త ఊరటనిచ్చింది. కరోనాపై భారత్ గెలిచేందుకు సమయం దగ్గరపడిదంన్న సంకేతాలు మోడీ చేసిన ప్రసంగం కనిపించాయి. అయితే అలాగని ఇష్టారాజ్యం ప్రవర్తించకూడదన్న హెచ్చరికా ఆయన ప్రసంగంలో ధ్వనించాయి. ఇళ్లలో ఉన్నంత మాత్రాన మనం ఒంటరివారం కాదని... ఇంట్లో ఉండే మనం సామూహిక యుద్ధం చేద్దామంటూ ఆయన ఇచ్చిన పిలుపు ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపింది.

 

 

కరోనా భయంతో దేశమంతా భయం అనే చీకట్లు కమ్ముకున్న వేళ.. వాటిని తరిమి కొట్టేందుకు మోడీ మరో కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా పాటించాలని.. ఈ ఆదివారం దేశ ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలని చెప్పారు. అందుకోసం ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్‌ చేసి కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలని పిలుపు ఇచ్చారు.

 

 

130 కోట్ల మంది ఈ సమయాన్ని తనకు ఇవ్వాలని కోరుతున్నా అంటూ ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలు ద్వారా దేశ ప్రజల శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు మోదీ. నిజమే.. జనతా కర్ఫ్యూ సమయంలో సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లతో కరోనా పై పోరాడుతున్నవారికి మద్దతు ఇవ్వాలని ఇచ్చిన పిలుపుతో మోడీ ఉత్సాహం నింపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి మరో సందేశం ద్వారా మోడీ ప్రజలకు ధైర్యం ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: