తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 154కు చేరింది. కరోనా వల్ల దేశవ్యాప్తంగా రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలోని ముకరంపూర్ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా భావించి అత్యాధునిక డ్రోన్ ల సహాయంతో పూర్తిగా శానిటైజ్ చేసింది. 
 
జిల్లాలోని ముకరంపూర్ ప్రాంతం ఇండోనేషియా నుంచి వచ్చిన పది మందికి స్థానికుడు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం కావడం... ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఇతర దేశాల్లో వినియోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉపయోగించటం మొదలుపెట్టింది. ప్రభుత్వానికి హైదరాబాద్ కు చెందిన మారుతీ డ్రోన్ టెక్ అనే కంపెనీ డ్రోన్ లను పంపిణీ చేస్తోంది. 
 
దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా బాధితులు నివశించిన ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వం కెమికల్స్ స్ప్రే చేయిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా స్ప్రే చేస్తున్న వారికి కరోనా సోకే అవకాశం ఉంది. అందువల్ల డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి కెమికల్స్ స్ప్రే చేయటాన్ని తెలంగాణ ప్రభుత్వం వరంగల్, కరీంనగర్ లలో దీనిని విజయవంతంగా చేపట్టింది. డ్రోన్లను ఉపయోగించి ఒక రోజులో 20 కిలోమీటర్ల పరిధిలో స్ప్రే చేయవచ్చు. 
 
50 మంది వ్యక్తులు ఒక రోజులో చేసే పనిని ఒక డ్రోన్ సహాయంతో చేయవచ్చు. ఈ డ్రోన్ల సహాయంతో రసాయనాల స్ప్రే మాత్రమే కాకుండా జనసమూహం ఉండే ప్రాంతాలలో స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేయవచ్చు. డ్రోన్ సహాయంతో అత్యవసర సామాగ్రిని కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపవచ్చు. డ్రోన్ లలో శరీర ఉష్ణోగ్రతలను కనిపెట్టే థర్మల్ స్కానర్లు కూడా ఉంటాయి. ఇవి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రజల ఉష్ణోగ్రతలను కనిపెట్టడంలో కూడా సహాయపడతాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: