దేశంలో కరోనా ని పూర్తిగా అరికట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కూడా కొంత మంది ప్రజలు వీటిని ఉల్లంఘిస్తూ బయట తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు.  ఈనేపథ్యంలో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతుంది.  తాజగా కరోనాని వ్యాప్తి చెందనివ్వకుండా విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ ముందుకొచ్చారు.  లాక్‌డౌన్ కారణంగా కూరగాయల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు.

 

వీలైనంత ఎక్కువమందికి కూరగాయలను అందించే ఉద్దేశంతో సిటీ బస్సులను సంచార రైతు బజార్లుగా మారుస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నారు. నగరంలో నిన్న ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సంచార రైతు బజార్లకు విశేష స్పందన లభించిందని కమిషనర్ తెలిపారు. బయట ఎక్కడ బడితే అక్కడ జనాలు తిరుగుతున్నారని.. ఇందుకు కోసం వారికి ఎన్ని సూచనలు చేసిన ఫలితం ఉండకుండా పోతుందని.. ఈ నేపథ్యంలోనే  సిటీ బస్సులను సంచార రైతు బజార్లుగా మార్చి వారి వద్దకు తీసుకు వెళ్తున్నామని.. అక్కడ కూడా సామాజిక దూరం ఉంచుతూ కూరగాయలు కొనుగోలు చేసే విధంగా చూస్తున్నామని అన్నారు.

 

ఆర్టీసీ బస్సుల ద్వారా నగరంలోని 53 డివిజన్ల పరిధిలో కూరగాయలు విక్రయించాలని యోచిస్తున్నారు. బస్సుల ద్వారా ప్రజల వద్దకే కూరగాయలను తీసుకెళ్లడం ద్వారా ప్రజలు ఒకే చోట గుమికూడకుండా చేయవచ్చన్నది అధికారుల ఆలోచన.  ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, తొలి రోజు 8 క్వింటాళ్ల కూరగాయలు విక్రయించామని అధికారులు తెలిపారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: