దేశంలో కరోనాని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న రోజు రోజుకీ ఈ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  తాజాగా విజయవాడలో 18 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా,  14 కేసులు ఢిల్లీ లింకులు అని చెబుతున్నారు. ప్రస్తుతం విజయవాడలోని మూడు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఏర్పాటు అమల్లోకి తీసుకు వచ్చారు. భవానీపురం, ఆటోనగర్, పాత రాజరాజేశ్వరిపేట... ఇలా మూడు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.  

 

మరోవైను ఏపిలో 149 చేరిన కరోనా పాజిటీవ్ కేసులు. నిన్న ఒక్కరోజు 38 కేసులు నమోదు అయ్యాయి. గత రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న కరోనా ఏపిలో విజృంభిస్తుంది. నిన్న ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ సైతం ఏపిలో జరుగుతున్న పలు విజయాల గురించి ఆయనకు తెలియజేశారు.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

 

మొత్తానికి ఏపిలో జరుగుతున్న పరిణామాల గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పటికప్పుడు మంత్రులు, అధికారులతో పర్యవేక్షిస్తున్నారు.  దేశ వ్యాప్తంగా కరోనా పై యుద్దం చేస్తూ ఉన్నా రోజు రోజు కీ పెరిగిపోతున్న కేసులను మాత్రం అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: