దేశంలో కరోనా వైరస్ ప్రభావం చూపిస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం మెల్ల మెల్లగా పెరిగిపోతుంది.  మొన్నటి వరకు ఏపిలో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా చూపకున్నా రెండు మూడు రోజుల నుంచి ఒక్కసారే ప్రళయం ముంచుకు వస్తున్నట్లు కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏపిలో 149 కి పెరిగాయి. తెలంగాణలో 154 కరోనా కేసులు నమోదయ్యాయి.   ఈ ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది.  తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువశాతం ఢిల్లీ నిజాముద్దీన్ కు లింక్ ఉన్న కేసులు కావడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది.  

 

తాజాగా కరీంనగర్ లో మరో నాలుగు కొత్త పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని డీఎంహెచ్‌వో సుజాత వెల్లడించారు. ఢిల్లీలోని మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిలో ముగ్గురికి, ఇండోనేసియా వారితో సన్నిహితంగా తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. కరోనా సోకిన బాధితులను సికింద్రాబాద్‌ గాంధీ, కింగ్‌ కోఠి ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు.

 

అయితే ఇటీవల ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన 19 మందిని గుర్తించామని, వారిలో 11 మందికి కరోనా నెగిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో తెలిపారు. మరో ఐదుగురికి సంబంధించి పరీక్షల నివేదికలు రావాల్సి ఉందన్నారు.  ఏది ఏమైనా ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు తెలుగు రాష్ట్రాల్లో వివిధ  ప్రాంతాల్లో తిరగడం వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువుగా ఉందన్న విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: