కరోనా... కరోనా... కరోనా... ఇప్పుడు ఈ విషయమం తప్ప ప్రపంచంలో ఎక్కడ ఇంకో విషయం లేదు అంటే నమ్మండి. నిజానికి ప్రపంచం మొత్తానికి పది లక్షల మందికి దీని బారిన పడ్డారంటే విష్యం అర్థం చేసుకోవాలి ఇది ఏ రేంజ్ లో ప్రపంచాన్ని వణికిస్తుందో. నిజానికి ఇది చైనా దేశంలో వుహాన్ నగరంలో మొదలై ప్రపంచంలోని అన్ని దేశాలకి పాకింది. అలాగే నిజానికి ప్రపంచం మొత్తంలో యూరప్ దేశాలు దీని దెబ్బకు కుప్పకూలింది అని చెప్పవచ్చు. ఇటలీ, స్పెయిన్, యూకే ఇలా చెప్పుకుంటూ పోతే యూరప్ లోని ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అంతేనా ప్రపంచంలో పెద్ద అన్నగా చెప్పుకొనే అమెరికాలో కూడా దీని ప్రతాపం చూపుతుంది.

 

 


అక్కడ నిజానికి రెండులక్షల దెగ్గర ప్రజలకి ఈ వ్యాధి సోకి విలయతాండవం చేస్తుంది. దీనితో అక్కడ ప్రభుత్వాలకి ఏమి చేయాలో అర్థం కాక చేతులు ఎత్తెశాయి. నిజానికి ఈ వ్యాధికి కావలిసిన వ్యాక్సిలను తయారీలో శ్యాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. నిజానికి అనేకమంది ఈ విషయంపై పరిశోధనలు చేస్తున్నాయి. కొంతంది కొన్నివిధాలా ప్రయతించారు గాని కానీ విజయం కొంత వరకే సంధించారు. ఇప్పుడు ఈ విషయం పై ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కొంతవరకు ముందడుగు వేశారని తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే...

 

 


ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా ప్రయోగాత్మకంగా రెండు వ్యాక్సిలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేపట్టారు. కామన్‌ వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ పరిశోధకులు ఈ ఘనతను సాధించారని చెప్పవచ్చు. దీనిపై ఇంకా కొన్ని పరీక్షలు జరుగుతున్నాయి. ఈ వైరస్‌ నుంచి మెరుగైన రక్షణ కోసం ఈ టీకాను ఎలా ఇవ్వాలన్న దానిపైనా వారు పూర్తిగా ఆలోచిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ని ఇంజెక్షన్‌ రూపంలో కండరాల్లోకి ఎక్కించాలా లేకపోతే ముక్కులో వేసుకునే స్ప్రేలా ఇవ్వాలా అన్నది దీనిని పరిశీలిస్తున్నారు. అయితే ఈ టీకాలపై ప్రయోగాలకు మూడు నెలల సమయం పడుతుందని పరిశోధనలో పాలుగొన్న ట్రెవర్‌ డ్రూ అనే శాస్త్రవేత్త తెలిపారు. చుడాలిమరి ఈ వ్యాక్సిన్ ఎంతవరకు కరోనా పై అడ్డుకోగలదో...!

మరింత సమాచారం తెలుసుకోండి: