దేశంలో అమలు అవుతున్న కరోనా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుంది.  కరోనా మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతున్న సమయంలో ఇండియాలో మాత్రం లిమిటెడ్ గా ఈ ప్రభావం చూపుతుంది.  ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించిపోతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రత్యేక రాయబారి డాక్టర్ డేవిడ్ నబారో తెలిపారు.  అమెరికాలో రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.  ఎంత కట్టడి చేసినా ఆగడం లేదు. ప్రపంచం మొత్తం మీద కరోనా పాజిటివ్ కేసులు మిలియన్ దాటిపోయింది.  ఇప్పటి వరకు అమెరికాలో మొత్తం 6,088 మరణాలు సంభవించాయి.  గత 24 గంటలో 1169 మరణాలు సంభవించడంతో అమెరికన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

 

కరోనా కేసులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడే భారత్ అప్రమత్తమైందని... లాక్ డౌన్ విధించి మహమ్మారి కట్టడికి కృషి చేసిందని తెలిపారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.  కరోనా భారీగా విస్తరించిన తర్వాత దాన్ని కట్టడి చేయడం చాలా కష్టమైన పని అని అన్నారు. తక్కువ కేసులు నమోదైన దశలోనే ప్రభుత్వ సూచనల మేరకు క్షేత్ర స్థాయి నుంచి కరోనా కట్టడి కోసం పోరాడితే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు.

 

కాగా, దేశంలో ప్రస్తుతం 2282 యాక్టివ్ కేసులు ఉన్నాయి... ఇక, కరోనా బారిన పడి కోలుకున్న 191 మంది ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు 72మంది మృతి చెందారు. దేశంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన వెంటనే భారత్ మేల్కొందని... మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే అవకాశాన్ని దేశ ప్రజలకు కల్పించిందని... ఇది ఎంతో ముందు చూపుతో తీసుకున్న నిర్ణయమని డేవిడ్ కితాబిచ్చారు. దీంతో క్షేత్ర స్థాయిలో కూడా మహమ్మారిని కట్టడి చేసే సమయం దొరికిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: