ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటికీ ఏకంగా అరలక్షకు కు చేరాయి కరోనా మరణాలు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ దారుణమైన కరోనా వైరస్ చిన్న చిన్నగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.. దాంతో ఇప్పటికీ 195 దేశాల్లో ఈ కరోనా మరణాలు మొదలయ్యాయి. రోజు రోజుకీ ఈ కరోనా మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి.. దేశ వ్యాప్తంగా ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మరణాలను మాత్రం అరికట్టలేక పోతున్నారు.  తాజాగా  ప్రపంచవ్యాప్తంగా నోవెల్ కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 50 వేలు దాటింది. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ ఈ విషయాన్ని చెప్పింది. 

 

కోవిడ్‌19 వల్ల 50,230 మంది మృతిచెందినట్లు రీసర్చ్ యూనివర్సిటీ పేర్కొన్నది. భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది.. భౌతికంగా ప్రజలను దూరం చేసి.. కరోనాను కట్టడి చేయాలని భావించిన ప్రభుత్వం లౌక్‌డౌన్ అమలు చేస్తోన్న సమయంలోనూ ఏ మాత్రం తగ్గకుండా... రోజురోజుకూ మరింత పెరుగుతూ కలవర పెడుతోంది కరోనా.. దేశంలో ప్రస్తుతం 2282 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే 2,45,193 పాజిటివ్ కేసులు నమోదు కావడం అందరిని భయపెడుతున్నది.  మరణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు అమెరికాలో మొత్తం 6,088 మరణాలు సంభవించాయి. 

 

గత 24 గంటలో 1169 మరణాలు సంభవించడంతో అమెరికన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  మరోవైపు వైరస్ సంక్రమించిన వారి సంఖ్య పది లక్షలు దాటినట్లు అధికారులు చెబుతున్నారు. నోవెల్ కరోనా వల్ల అత్యధికంగా ఇటలీ నష్టపోయింది. ఆ దేశంలో సుమారు 13,915 మంది మరణించారు. స్పెయిన్‌లో సుమారు 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మూడవ స్థానంలో అమెరికా ఉన్నది. ఆ దేశంలో ఇప్పటి వరకు 5316 మంది మరణించినట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: