కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రజలు అంత కూడా ఇళ్లల్లోనే ఉండాల్సిన దుస్థితి. దీనితో రోజు వారి కూలీలకు వెళ్లే వారి పరిస్థితి ఘోరం అనే చెప్పాలి. ఇప్పటికే ఆర్ధిక పరిస్థితి కూడా క్షీణించింది. అయితే ఈ కరోనా వల్ల లాక్ డౌన్ ని మోదీ సర్కారు ప్రకటించడం ప్రజలు అంతా కూడా పాటించడం జరగనుంది.

 

I faced a lot of ups and downs: Sampath Nandi

 

 

 

ఇందుకు  కారణంగా జనం అంతా ఇళ్లల్లోనే ఉంటున్నారు. ప్రభుత్వం కూడా ప్రజలకి తమ వంతు సహాయం అందిస్తోంది. ఎంతో మంది నాయకులు, వ్యాపార వేత్తలు , నటులు, పలు కంపెనీలు కూడా కరోనా పోరాటానికి తమ వంతు సహాయం అందించడానికి ముందుకి వచ్చారు. నేను సైతం అంటూ తమ ఉదార స్వభావాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు .

 

 

ఇలా ఎంతో మంది కరోనా వల్ల వచ్చే ఇబ్బందులని పోగొట్టడానికి సాయం చేస్తున్నారు. సమాజానికి మనం కూడా చెయ్యాలి అని ముందుకి వచ్చాడు దర్శకుడు సంపత్ నంది. ఈ కరోనా పై పోరాటం లో భాగంగా తానూ విరాళం ప్రకటించాడు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్న కార్మికులకు పని లేకుండా ఉండడం వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు పడకూడదని సినీ ఇండస్ట్రీ కరోనా క్రైసిస్  అని ఒక ఛారిటీ ఏర్పాటు చేసారు .

 

 

దానిలో సంపత్ నంది రూ. 5 లక్షలని తన వంతు విరాళంగా అందించాడు . ప్రస్తుతం దర్శకుడు సంపత్ నంది హీరో  గోపిచంద్ , తమన్నాతో సినిమా చేస్తున్నాడు . కానీ కరోనా వైరస్ వల్ల అన్ని సినిమాల షూటింగ్లు కూడా కొంత కాలం ఆగిపోయాయన్న సంగతి  తెలిసినదే . 

మరింత సమాచారం తెలుసుకోండి: