కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా చైనాలో జరుగుతున్న ఓ ప్రయోగం వివాదాస్పదం అవుతోంది. అసలు చైనా అడ్డగోలు మాంసాహర అలవాట్ల వల్లే ఈ కరోనా వచ్చిందన్న ప్రచారం ఇప్పటికే ఉంది.

 

 

ఇలాంటి సమయంలో చైనాలో ఎలుగుబంటి పైత్య రసాన్ని ఉపయోగించి కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇందుకు చైనా అధికారులు ఇప్పుడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పుడు ఇది చైనాలో కొత్త వివాదాలకు దారి తీస్తోంది. జంతువుల అక్రమ వ్యాపారాన్ని నిరోధించే ప్రక్రియకు ఇది తీవ్ర విఘాతం కలిగిస్తుందని చైనాలోని హక్కుల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఇప్పటికే చైనాలో కనిపించిన జంతువులన్నింటినీ తింటున్నారన్న పేరు ప్రపంచ వ్యాప్తంగా వచ్చేసింది. చైనా ప్రజలు మనుషులను మినహా తమ కంటికి కనిపించే ప్రతి జీవిని తింటారంటారు. చీమ నుంచి పాము వరకు ప్రతి ఒక్కటీ రుచితో పని లేకుండా తినేస్తారని పేరు ఉంది. కొందరైతే పచ్చి మాంసాన్ని కూడా తినేస్తారట. బీజింగ్‌లోని వాంగ్‌ఫుజింగ్ రోడ్‌లో ఏర్పాటు చేసే నైట్ మార్కెట్‌లో తేళ్లు, బొద్దింకలు, పురుగులను దోరగా వేయించి, పుల్లలకు గుచ్చి ఇస్తారు.

 

 

ఇంకా చైనా వాళ్ల ఆహర అలవాట్ల గురించి చెప్పుకోవాలంటే.. చైనీయులు తేనెటీగలను కూడా వదిలిపెట్టరు. బీజింగ్ నైట్ మార్కెట్లో వాటిని నూనెలా వేయించి స్నాక్స్‌లా అందిస్తారు. చూస్తేనే ఒళ్లు జలదరించే పాములను కూడా చైనా వాళ్లు కోసేసి నూనెలో వేపుకుని తేనేస్తారు. సూప్ తయారు చేసుకుని వేడి వేడిగా తాగేస్తారు. పాములతో రకాల వంటకాలు తయారు చేస్తారు. ఈ పాము వంటకాల కోసం ఏకంగా అక్కడ ప్రత్యేకంగా స్నేక్ రెస్టారెంట్లు కూడా ఉంటాయట.

 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: