కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. మార్చి 22 నుండి ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమలులో ఉండటంతో దేశంలో రవాణా తో పాటు అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో విమాన రాకపోకలు రైల్వే అదేవిధంగా బస్సు ప్రయాణాలు అన్ని కూడా దేశవ్యాప్తంగా స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14వ తారీఖున లాక్‌డౌన్ ముగియనున్న క్రమంలో ఇండియన్ రైల్వే ఏప్రిల్ 15 నుండి సేవలో పునరుద్ధరించడానికి రెడీ అయినట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం తన పత్రికలో చెప్పుకొచ్చింది.

 

పత్రికలో వచ్చిన వార్త బట్టి చూస్తే పూర్తి స్థాయిలో కాకుండా మొదటిగా పాసింజర్ రైళ్ల రిజర్వేషన్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన తరువాత క్రమక్రమంగా రైల్వే సేవలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విస్తరించాలని చూస్తున్నట్లు వచ్చిన వార్తా పత్రికలో ఉన్న సారాంశం. ఈ నేపథ్యంలో irctc ఏప్రిల్ 15 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తుందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేసిన వెంటనే ప్యాసింజర్ సేవలు ప్రారంభించనున్నట్లు అది కూడా ఒక్కసారిగా ప్రారంభం కావాని దశలవారీగా అవుతాయని చెప్పుకొచ్చారు.

 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రైళ్ళు ఎక్కడికక్కడ స్తంభించింది పోగా నిత్యావసర వస్తువులు, ఇతర సరుకులు, వైద్య పరికరాలను రవాణా చేసేందుకు గూడ్స్ రైళ్లను ఎప్పట్లాగే రైల్వే శాఖ నడుపుతోంది. రోజుకు 9,000 గూడ్స్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. దీంతో ఈ వార్తా ప్రకటనపై జనాలు రకరకాలుగా ప్రతి స్పందిస్తున్నారు. రైల్వే పాసింజర్లు నడుపుతామని ప్రకటన చేసిన రైల్వే శాఖ ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అంత పెద్ద సాహయం చేస్తే ప్రయాణికులకు రిస్క్ ఏమో గ్రహించాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: