ప్రపంచంలోని కరోనా స్వైర విహారం చేస్తున్న తరుణంలో వివిధ దేశాలు దాన్ని అరికట్టడంలో భాగంగా... అనేక చర్యలను చేపడుతున్న విషయం తెలిసినదే కదా. ఇక కరోనా వైరస్‌ కు కౌంటర్ గా మన దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ వుంది . ఇక ఈ లాక్‌డౌన్  కారణంగా మనదేశానికి  ప్రాణ నష్టం... అధికంగా ఆర్ధిక నష్టం వాటిల్లుతోంది . అలాగే ఎంతో మంది కార్మికులు పనులులేక నిరాశ్రుయులు అయ్యారు. 

 

ప్రస్తుత  దుస్థితిని  మెరుగుపరిచేందుకు .. వివిధ వర్గాల ప్రముఖులు ముందుకొచ్చి, తమకు  తోచినంత   సాయాన్ని ఇస్తున్న సంగతి తెలిసినదే... ఇప్పటికే పలువురు వ్యాపార దిగ్గజాలు... క్రికెట్ క్రీడాకారులు... రాజకీయ నాయకులూ... అలాగే సినిమా ఆర్టిస్టులు... టెక్నిషియన్లు... కోట్లలో విరాళాలు ప్రకటించి, తమ దాతృత్వాన్ని ప్రకటిస్తున్న విషయం తెలిసినదే.

 

అందులో భాగంగానే.. కరోనా పైన యుద్ధం చేసేందుకు బాలీవుడ్ సూపర్ హీరోయిన్ కంగనా రనౌత్  తన  వంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి ట్రాన్స్ఫర్ చేసి... దేశం మీద తనకున్న  దాతృత్వాన్ని చాటుకుంది. అలాగే ఆమె  తల్లి.. తల్లి ఆశా రనౌత్  తన నెల రోజుల పెన్షన్‌ను ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇచ్చారు. ఈ  విషయాన్నీ  కంగనా  ముద్దుల సోదరి రంగోలి అధికారికంగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

 

అలాగే మన ముంబై (బాలీవుడ్) నుండి ఎంతోమంది ప్రముఖులు విరాళాలు ప్రకటించి, తమ ఉనికిని చాటుకున్నారు. ఇటీవల నటుడు అజయ్ దేవ్‌గన్ తమ సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు రూ. 51 లక్షల ఆర్ధిక సాయాన్ని చేసి తన ఉదారతను చాటుకున్నాడు. ఇకపోతే... బాలీవుడ్   పరిశ్రమని నమ్ముకున్న   పదిహేను వేల మంది సినీ కార్మికులకు యశ్ రాజ్ ఫిల్మ్ సంస్ధ ఆర్ధిక సహాయాన్ని అందజేయడానికి  పూనుకుంది. అందమైన దంపతులు సైఫ్, కరీనా కపూర్ లు ప్రధానమంత్రి సహాయ నిధితో పాటుగా  మహారాష్ట్ర ప్రభుత్వానికి విరాళాన్ని అందజేసిన  విషయం తెలిసినదే.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: