ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం కొనసాగుతుంది. ఆ దేశం ఈ దేశం, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, చిన్నా పెద్దా ముసలీ ముతకా అనే తేడా లేకుండా కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తుంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అన్నీ కూడా కంటి మీద కునుకు లేకుండా ఉన్నాయి. కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు కరోనా దెబ్బకు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. 

 

కరోనా ఇప్పుడు పది లక్షల మార్క్ దాటింది. ప్రపంచ వ్యాప్తంగా 1,016,413 మందికి కరోనా వైరస్ సోకింది. 53,238 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 213,136 మందికి కరోనా వైరస్ పూర్తిగా నయం అయి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 712,384 (95%) మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 37,655 (5%) మంది ఆరోగ్యం మాత్రం విషమించింది. వీరికి అత్యంత జాగ్రత్తగా చికిత్స అందిస్తున్నారు. 

 

ఇక అమెరికాలో రెండు లక్షల 50 వేలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. అమెరికాలో దాదాపు 7 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇటలీలో స్పెయిన్ లో కరోనా ఇదే స్థాయిలో ఉంది. 115,242 మందికి ఇటలీ లో కరోనా వైరస్ సోకింది. ఇక మన దేశంలో 2500 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కరోన కేసులు 161 కి చేరుకున్నాయి.  తెలంగాణాలో 154 మందికి కరోనా సోకింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: