ఏపీ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త.  తూర్పు గోదావ‌రి జిల్లాలో క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన యువ‌కుడు ద‌వాఖాన‌లో  చికిత్స పొంది కోలుకున్నాడు.గ‌త నెల 17న లండ‌న్ నుంచి వ‌చ్చిన యువ‌కుడికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో క‌రోనా పాజిటివ్ అని తేలింది. వెంట‌నే అధికారులు కాకినాడ ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించి, ఐసోలేష‌న్లో ఉంచారు. ఎట్ట‌కేల‌కు ఆ యువ‌కుడు క‌రోనా నుంచి కోలుకోవ‌డంతో శుక్ర‌వారం ద‌వాఖాన నుంచి డిశ్చార్జ్ చేశారు.

 

 

ఈ సంద‌ర్భంగా వైద్యులు, అధికారులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఇంటికి వెళ్లిన త‌ర్వాత కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆ యువ‌కుడికి వైద్యులు, అధికారులు సూచించారు. ప‌ద్నాలుగు రోజుల పాటు హౌం క్వారంటైన్‌లో ఉండాల‌ని సూచించారు. కాగా  ఆ యువ‌కుడు వైద్యుల‌కు, అధికారుల‌కు కృత‌జ్క్ష‌త‌లు తెలిపాడు. క‌రోనా బాధితుడు కోలుకోవ‌డంతో ఏపీ ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 161 మంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: