కరోనా వైరస్ తో అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమవుతోంది. ప్రపంచంలోనే ఎక్కువ  కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి దేశంగా అమెరికా వార్తల్లో నిలిచింది. దీనంతటికి కారణం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అసమర్థత అని చాలామంది విమర్శలు చేస్తున్నారు. మొదటి లో వైరస్ గురించి వార్తలు వచ్చిన టైంలో చాలా క్యాజువల్ గా డోనాల్డ్ ట్రంప్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్న టైంలో వారం రోజుల్లో ఈ వైరస్ కి వ్యాక్సిన్ తీసుకొస్తాను అని అమెరికా ప్రజలకు చెప్పడం జరిగింది.

 

దీంతో ప్రభుత్వం వైరస్ విషయంలో సీరియస్ గా లేకపోవడంతో అమెరికా ప్రజలు కూడా చాలా లైట్ తీసుకున్నారు కరోనా వైరస్ ని దీంతో అది విచ్చలవిడిగా విజృంభించింది అనే అంతర్జాతీయ స్థాయిలో అమెరికా ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా దేశంలో ఉన్న పరిస్థితి చూస్తే ఆర్థికంగా కూడా అమెరికా చాలావరకు నష్టపోయిందని ఈ పరిణామాలు గట్టెక్కాలంటే సమర్థవంతమైన నాయకుడు రంగంలోకి దిగాలని చాలామంది కోరుతూ సోషల్ మీడియాలో మరియు అమెరికా మీడియా ముందే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా మళ్లీ అగ్రరాజ్యంగా నిలబడాలంటే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రంగంలోకి దిగాలని చాలామంది కోరుతున్నారు. ఇటువంటి టైంలో బరాక్ ఒబామా ఉంటే కచ్చితంగా కరోనా వైరస్ ని కట్టడి చేసే వాడిని ...అగ్రరాజ్యం అమెరికా సరిహద్దుల్లోకి కూడా కరోనా వైరస్ వచ్చి ఉండేది కాదని...ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాని కాపాడాలంటే బరాక్ ఒబామా రావాలని చాలా మంది కోరుతున్నారు. అమెరికాలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య బట్టి చూస్తే..భవిష్యత్తులో కొన్ని లక్షల మంది అమెరికన్లు చనిపోయే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. 




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: