కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత ఆపత్కాలంలో హోం క్వారంటైన్‌లో ఉన్న రోగులను పర్యవేక్షించేందుకు మొబైల్ యాప్‌ను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది.  కరోనా వ్యాప్తి చెందకుండా ప్రస్తుతం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హిమాచల్‌ప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ రూపొందించిన ‘కరోనా ముక్త్ హిమాచల్’ మొబైల్ యాప్ ద్వారా వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలు హోం క్వారంటైన్ లో ఉన్న వారి కదలికలను పర్యవేక్షిస్తారు.  మొబైల్ యాప్ ద్వార హోంక్వారంటైన్ లో ఉన్న వారు నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరోగ్యకార్యకర్తలు సులభంగా గుర్తిస్తారని హిమాచల్‌ప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ రోహాన్ చాంద్ ఠాకూర్ చెప్పారు.

 

ఇదిలా ఉంటే.. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలో తబ్లీగీ జమాత్ కు వెళ్లివచ్చిన ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలడంతో జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. కరోనా వ్యాప్తి చెందో ప్రమాదం ఉండడంతో అత్యవసర చర్య కింద సీఆర్‌పీసీ 144 సెక్షన్ ప్రకారం కర్ఫ్యూ విధించినట్టు ఊనా కమిషనర్ సందీప్‌కుమార్ తెలిపారు.అత్యవసర సేవలు, మినహాయింపు పొందిన సంస్థలు మాత్రమే పనిచేస్తాయని కమిషనర్ వివరించారు.

 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మరింత విజృంభిస్తుందని.. ఇలాంటి సమయంలో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మరింత ప్రమాదం ముంచుకు వస్తుందని అంటున్నారు.   గ్రామం చుట్టూ 3 కిలోమీటర్ల ప్రాంతాన్ని దిగ్బంధనంలో ఉంచినట్టు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కార్తికేయన్ గోకుల్‌చంద్రన్ తెలిపారు.కానీ వారిలో ఇద్దరు మండీకి, ఒకరు సుందర్‌నగర్‌కు చెందినవారు. దాంతో ఆయా ప్రాంతాల్లోనూ అలర్ట్ ప్రకటించారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: