కరోనా వైరస్ పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ నాయకుల నోటి నుండి నిజాలు బయటపడుతున్నాయి. కరోనా వైరస్ ని పొలిటికల్ గా ఉపయోగించాలని ప్రజలలో పొలిటికల్ మైలేజ్ సాధించాలని చూసిన టీడీపీకి పెద్దగా వర్కవుట్ కాలేదు. పూర్తి మేటర్ లోకి వెళితే ఇటీవల బడ్జెట్ విషయంలో జగన్ పాలనలో ఆదాయం పెరిగినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయంగా వెల్లడించారు. కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు రెడీ అయింది. అంతే కాకుండా ఇటీవల ప్రధాని మోడీ తో వీడియో కాన్ఫరెన్స్ లో విభజనతో ఆర్థికంగా నష్టపోయి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఇటువంటి టైం లో నిధులు ఇచ్చి ఆదుకోవాలని సీఎం జగన్ విన్నవించుకున్నారు.

 

ఈ నేపథ్యంలో ఇటువంటి టైములో రాజకీయాలు చేయడం లేదని చంద్రబాబు ఒకవైపు చెబుతూనే అదే టైములో తెలుగుదేశం పార్టీకి చెందిన దూళిపాళ్ల నరేంద్ర తో సీఎం జగన్ కి బహిరంగ లేఖ రాయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. పూర్తి మేటర్ లోకి వెళ్తే ప్రస్తుత పరిస్థితిని లేవనెత్తి..ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ లో కరోనా వైరస్ అరికట్టడంలో వైయస్ జగన్ సర్కార్ విఫలమైందని అంతేకాకుండా చాలా తేలికగా తీసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లు దూళిపాళ్ల నరేంద్ర చెప్పుకొచ్చాడు. జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పదేళ్లపాటు వెనక్కి వెళ్లి పోయిందని లేఖలో పేర్కొన్నారు.

 

ఇటువంటి టైం లో అదే లెటర్లో దూళిపాళ్ల నరేంద్ర ఆర్థిక పరిస్థితి గురించి ఈ విధంగా రాశారు.. ‘‘గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చేతికి రూ.30 వేల కోట్లు అద‌నంగా వ‌చ్చాయి.   రెండు రోజుల క్రితం ముగిసిన ఆర్థిక సంవ‌త్స‌రం (2019-2020)లో ప్ర‌భుత్వం చేతికి వ‌చ్చిన నిధులు రూ.1.87 ల‌క్ష‌ల కోట్లు. రాష్ట్ర ఆదాయం, కేంద్రం నుంచి వ‌చ్చిన ఆదాయం, రుణాల నుంచి సేక‌రించిన నిధులు ఇందులోకి వ‌స్తాయి. 2018-19లో ఇవే ప‌ద్దుల కింద రూ.1.57 లక్ష‌ల కోట్లు వ‌చ్చాయి. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి అద‌నంగా రూ.30 వేల కోట్ల నిధుల ల‌భ్య‌త పెరిగింది’’ ....అని రాయటం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కచ్చితంగా జగన్ సర్కార్ వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని అందుకే నిధులు పెరిగాయని ఒక విధంగా టిడిపి రాసిన ఈ లెటర్ వైకాపా వాళ్ళకంటే జగన్ కి ఎక్కువ పాజిటివ్ బూస్ట్ టిడిపి ఇచ్చినట్లు అయిందని రాష్ట్రంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: