ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేస్తుందీ కరోనా వైరస్.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి ఈ కరోనా వైరస్ అక్కడ మాత్రం శాంతించింది.. పలు దేశాల్లో విజృంభిస్తుంది.  ఈ కరోనా దెబ్బకు అమెరికా లాంటి అగ్ర రాజ్యం కూడా అతలాకుతలం అవుతుంది.  భారత్ లో కరోనాని కట్టడి చేసే విషయంలో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. కానీ,  దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగిపోయాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2183కి పెరిగిందని ఇండియన్ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించింది. 

 

కొద్ది సేపటికే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరో ప్రకటన చేసింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 2,301 కేసులు నమోదయ్యాయని వివరించింది. వారిలో 2088 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోరోనా వ్యాప్తి చెందుకుండా సాధ్యమైనంత వరకు తమ కృషి చేస్తున్నా కొంత మంది నిర్లక్ష్యం వల్ల.. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల ఈ కరోనా వ్యాప్తి మరింద పెరుగుతుంది. 

 

ఇటీవల  నిజాముద్దీన్‌ కార్యక్రమం వల్ల దేశంలో ప్రస్తుతం కరోనాకేసుల సంఖ్య విపరీతంగా పెరగడం చాలా బాధ కలిగిస్తున్న విషయమని  అంటున్నారు. కాగా, మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారని తెలిపింది. 24 గంటల్లో 336 కొత్త కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఇప్పటివరకు 157 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని వివరించింది.  సాధ్యమైనంత త్వరగా వైరస్ బారిన పడిన వారికి దగ్గరగా మెలిగిన వారందరినీ గుర్తించకుంటే పెను ప్రమాదం సంభవించవచ్చని హెచ్చరిస్తుంది కేంద్రం. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: