ప్రస్తుతం  కరోనా వైరస్ ను  తరిమి కొట్టడానికి  కేంద్ర ప్రభుత్వం దేశం అంతటా  లాక్ డౌన్ అమలులోకి తీసుకోని వచ్చింది. దీనితో పేద, మధ్య తరగతి  కుటుంబాలపై చాలా ప్రభావం కనిస్తుంది. ఈ ప్రభావాన్ని అరికట్టేంద్దుకు కేంద్ర సర్కార్ వారికీ తగిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జన్ ధన్ ఖాతా ఉన్న మహిళకు అందరికి 3 నెలల పాటు రూ.500  అందచేస్తాము అని తెలియచేయడం జరిగింది. ఇందులో భాగంగా నేటి నుంచి మొదటి విడతగా రూ.500 జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  నేటి నుంచి  జన్ ధన్ బ్యాంక్ ఖాతా ఉన్న మహిళకు అందరికి వారి అకౌంట్లో జమ అవుతాయి అని ప్రభుత్వం ప్రకటించింది. 

 

 


ఇక పూర్తి వివరాల్లోకి వస్తే... తొలి విడతగా జమ అవ్వాల్సిన డబ్బులు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9 మధ్యలో అన్ని అకౌంట్లలోకి వస్తాయి అని ప్రభుత్వం తెలియచేసింది. ఇక  జన్ ధన్ ఖాతా నెంబర్ చివరిలో 0 , 1 ఉంటే వారికి ఏప్రిల్ 3 డబ్బులు వస్తాయి అని తెలిపింది. అలాగే అకౌంట్ నెంబర్ చివరిలో 2, 3 ఉంటే ఏప్రిల్ 4న, 4, 5 ఉంటే ఏప్రిల్ 7న, 6 లేదా 7 ఉంటే ఏప్రిల్ 8న, 8 లేదా 9 ఉంటే ఏప్రిల్ 9న రూ.500 డబ్బులు మహిళా అకౌంట్‌లో జమ అవుతాయి అని ప్రభుత్వం  వెల్లడించింది. అలాగే ఒకవేళ  మీ అకౌంట్ నెంబర్ చివరిలో 0 లేదా 1 ఉంటే నేడే బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా కలిపించింది కేంద్ర ప్రభుత్వం.

 

 

ఇంకా మీ దగ్గర  రూపే డెబిట్ కార్డు ఉంటే ఏటీఎం సెంటర్‌ ద్వారా  డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు అని తెలిపింది.  రూపే డెబిట్ కార్డు ఉన్న వారు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా వెల్లడించింది. ఇది ఇలా ఉండగా  దేశంలో కరోనా కేసులు ఇప్పటికే 2,300 పైగా నమోదు అయ్యాయి.  ఇప్పటి వరుకు  53 వేల మందికి పైగా కోవిడ్ 19 వల్ల మృతువాత పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: