కరోనా వైరస్ నేపధ్యంలో దేశం లాక్‌డౌన్ అమలులో ఉంది.. ఈ నేపధ్యంలో కిరాయి ఇంటిలో అద్దెకుండే వారు కూడా చాలా జాగ్రత్తగా ఈ వైరస్ సోకకుండా తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు.. సొంత ఊర్లకు వెళ్లే వీలు లేకున్నా, అద్దె ఇళ్లల్లో ఉంటు ఎలాగోలా తమ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.. ఇంట్లో నుండి బయటకు వెళ్లకుంటే కరోనా రాదనే నమ్మకంతో ఉండగా, కిరాయి ఇంట్లో ఉన్న వారికి పిడుగులాంటి వార్త ప్రచారం జరుగుతుంది.. అదేమంటే, ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు దాదాపుగా అన్ని జిల్లాల నుంచి తబ్లిగీ జమాత్ కార్యకర్తలు హాజరైనట్లు వెలుగులోకి రావడంతో నగర ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.

 

 

కాగా ఇలా ఢిల్లీ మర్కజ్ కు వెళ్లిన ఇంటి ఓనర్లు ఉంటే, వారింట్లో కిరాయికి ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. ఇకపోతే ఈ సమావేశాలకు వెళ్లొచ్చిన వారి కారణంగా నగరం వల్ల కాడులా మారే పరిస్దితి తలెత్తుతుంది.. కాగా గత రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి. ఇంతే కాక గురువారం రాత్రికి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 154కు చేరగా.. ఏపీలో 149కి చేరాయి. ఇంకా 1500 మంది వరకు నమూనాల రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మర్కజ్ మూలాలున్న వ్యక్తుల విషయం చెబితేనే ప్రజలు వణికి పోతున్నారు.

 

 

ఒకగానొక దశలో కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల ఉదంతం బాంబ్ పేల్చినట్లయింది. కాగా సుమారుగా ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి 1030 మందికి పైగా వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వారికోసం అణువణువూ జల్లెడ పడుతూ వారిని ఆస్పత్రులకు తరలించారు. ఇక వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ సమయంలో ఇప్పుడు అద్దే ఇంట్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ముఖ్యంగా మర్కజ్ కు వెళ్లివచ్చిన ఇంటి ఓనర్లతో చాలా జాగ్రత్త.. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం... ఇన్నిరోజులు ఇంట్లో ఉండి ఉపయోగముండదు అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: