ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈ సమావేశానికి హాజరైన వేలమందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. ఈ కార్యక్రమ నిర్వాహకులపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా శివసేన కూడా ఈ ఘటనపై చాలా ఘాటుగా స్పందించింది. ఇది క్షమించరాని నిర్లక్యం అంటూ తన పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంగా దుయ్య బట్టింది.

 

 

కరోనావైరస్ మహమ్మారి సమయంలో డిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మతపరమైన సమావేశాన్ని నిర్వహించడం "అమానవీయ" చర్య అని.. గత నెల జరిగిన ఈ కార్యక్రమ నిర్వాహకుల తీరు ఏమాత్రం క్షమించరానిదంటూ మండిపడింది. దేశ రాజధానిలోని తబ్లిఘి జమాత్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. భారతదేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. చివరకు ఇది దేశంలోనే కోవిడ్ -19 హాట్‌స్పాట్‌గా మారింది.

 

 

శివసేన తన సంపాదకీయంలో ఏం రాసిందంటే.. ఇస్లాం పేరిట ఇలాంటి క్షమించరాని తప్పులు చేసేవారు సమాజానికి ఏం సేవలు చేస్తారంటూ విమర్శించింది. వాస్తవానికి ఇది అమానవీయం.. గొప్ప అపచారం అని తన పార్టీ మౌత్ పీస్ సామ్నా పత్రిక సంపాదకీయంలో రాసింది. కరోనా కారణంతో పలు ఇస్లామిక్ దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. మక్కా మరియు మదీనాలో కూడా లాక్డౌన్ ఉంది. కానీ వీరు మాత్రం ఇలాంటి భారీ సమీకరణతో దిద్దుకోలేని తప్పు చేశారని కూడా కామెంట్ చేసింది.

 

 

ఢిల్లీ ఎన్నికల తర్వాత షహీన్ బాగ్ ప్రాంతాన్ని ఖాళీ చేసినట్టే.. ఈ కార్యక్రమాన్ని కూడా ఆపి ఉండాల్సిందని.. ఇది మతానికి సంబంధించిన కార్యక్రమం కాదని.. ఇది దేశప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయమని శివసేన పేర్కొంది. కొందరు ఈ విషయంతో కూడా రాజకీయాలు చేస్తున్నారని శివసేన తన వ్యాసంలో విమర్శించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: