తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.  ఇప్పటి వరకు 154 కరోనా కేసులు నమోదయ్యాయి. 9 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే  ఇందులో చాలా వరకు నిజాముద్దీన్ మర్కజ్ కు లింక్ ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. తెలంగాణ నుంచి మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవల వారు ఢిల్లీ నుంచి  తిరిగి తెలంగాణకు రావడంతో కేసులు పెరిగిపోతున్నాయి. 

 

నిజాముద్దీన్ నుంచి వచ్చిన వీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారు...అనే విషయాలను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది.  తెలంగాణలో మొత్తం ఆరు ప్రాంతాల్లో వీరు ఉన్నట్టుగా గుర్తించింది.  భైంసా, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ పాతబస్తీ, గద్వాల్, మిర్యాలగూడ ప్రాంతాలను హాట్ స్పాట్ గా గురించారు.   ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. హాట్ స్పాట్ల నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోకి ఎవరినీ అనుమతించడం లేదు.

 

అక్కడి వారిని బయటకు పంపించడం లేదు.  ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ కు లింకుతో కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. హాట్ స్పాట్ ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలోకి ఎవరిని అనుమతించరు.  ఇక్కడ నుంచి ఎవరిని బయటకు పంపించరు.  ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం కావాలి.  హాట్ స్పాట్ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.  ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య ఎక్కువ ఉంటే.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి సంఖ్య తీవ్రం అవుతుందని ఆందోళన చెందుతున్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: