కరోనా వైరస్ ఎందుకొచ్చినా మంచికే అనుకుంటున్న వాళ్ళూ ఉన్నారు. ఎపుడూ పని అంటూ బిజీ లైఫ్ లో గడిపే వారంతా ఇపుడు ఇంటిపట్టునే  ఉండాల్సివచ్చింది. ఇది తెచ్చిపెట్టుకున్నది కాదు, కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి. దాంతో భారత్ అంతా ఇంటి తలుపు మూసుకుంది. 

 

మరి మూసిన తలుపుల వెనక సరి కొత్త వలపులు ఇపుడు చిగురిస్తున్నయట. చిలిపి పనులకు వేళాయేరా అంటున్నారుట. ఇందుకో కొత్తా పాతా తేడా లేకుండా జంటలన్నీ బెడ్ రూములకు అతుక్కుపోతున్నారుట. దాంతో ఇపుడు మాస్కులు, శానిటైజర్లతో పాటుగా కండోమ్స్  కి కూడా ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడిందట.

 

ఇంట్లో ఉండి టైమ్ పాస్ కోసం చాలా మంది టీవీలు చూస్తూంటే మరి కొంత మంది పోర్న్ వీడియోలను చూస్తున్నారని రేటింగ్ చెబుతోంది. చాలా మంది జంటలు మాత్రం వలపు వ్యవసాయం చేస్తూ ఫుల్ బిజీ అయిపోతున్నారుట. వారంతా సేఫ్టీ మెజర్స్ కోసం కండోమ్స్ వాడుతున్నారుట.

 

దాంతో ఇపుడు నగరాలు, పట్టణాలలోని దుకాణాలలో వాటి కోసం డిమాండ్ ఎక్కువగా ఉందిట. దీంతో ఇవిపుడు స్టాక్ లేవు అని చెపాల్సివస్తోందని అంటున్నారు. సాఫ్ట్ వేర్ ప్రపంచంలో డే షిఫ్ట్ ఒకరు, నైట్ షిఫ్ట్ ఒకరు డ్యూటీలు చేస్తూ అసలైన సంసార  సుఖాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇపుడు వర్క్ ఫ్రం హోం తో ఏకంగా ఇంట్లో కావాల్సినంత టైం ఇద్దరికీ దొరకడంతో దాన్ని శ్రుంగార దేవతకు నైవేద్యంగా పెడుతున్నారుట.

 

దీనికి ఆరోగ్యపరమైన కారణాలను కూడా మరికొందరు చెబుతున్నారు. సెక్స్ చేస్తే రోగ నిరోధ‌క శక్తి బాగా పెరుగుతుందని, దాని వల్ల కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చునని అంటున్నారు. అందువల్ల సెక్స్ కోసం జంటలు తాపత్రయ‌పడుతున్నారుట. ఇందులో కొత్త వారే కాదు, పాత జంటలు కూడా ఆత్రం చూపుతున్నరని సర్వే నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి వర్క్ ఫ్రం హోం చాలా పెద్ద పనే ఇంట్లో పెట్టిందని రసిక ప్రియులు ముసిముసినవ్వులతో చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: