క‌రోనా ప్ర‌పంచాన్ని అత‌లా కుత‌లం చేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 ల‌క్ష‌లు దాటేసింది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా 53 వేలు దాటాయి. ఇక మ‌న‌దేశంలో క‌రోనా బాధితులు ఇప్పటి వ‌ర‌కు 2567 చేరుకున్నాయి. క‌రోనా మ‌ర‌ణాలు ఇప్ప‌టి వ‌ర‌కు 72 ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ‌లో 154, ఏపీలో 161కు చేరుకున్నాయి. ఇక తెలంగాణ‌లో ఇప్ప‌టికే 9 క‌రోనా మ‌ర‌ణాలు ఉన్నాయి. 

 

ఏపీలో తొలి కరోనా మరణం నమోదయ్యింది. వైరస్‌ సోకి షేక్‌ సుభాని (55) అనే వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మరణించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. షేక్‌ సుభాని డయాబెటిస్‌ కార్డియాక్‌ ఆరోగ్య సమస్యలతో మార్చి 30న విజయవాడలోని జనరల్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే అతని కుమారుడు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించిన వైద్యులు.. కుమారుడితో పాటు సుభానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ అని తేలింది. 

 

ప్ర‌పంచ వ్యాప్తంగా శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 18, 536

మృతుల సంఖ్య - 53, 280

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 2, 13, 499

యాక్టివ్ కేసుల సంఖ్య - 7, 51, 757

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 66, 779

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 2, 45, 373 - 6095

ఇట‌లీ - 1, 15, 242 - 13, 915

స్పెయిన్ - 1, 12, 065 - 10, 348

 


భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 2567

కొత్త కేసులు - 24

మృతులు - 72

తెలంగాణ‌లో కేసులు - 154

తెలంగాణ మృతులు - 9

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 161

కొత్త కేసులు - 27

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: