క‌రోనా వైర‌స్(కోవిడ్‌-19).. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ళ్లోలం చేస్తోంది. అయితే కరోనా వైరస్ చైనాలో కంటే ఎక్కువ యూరప్ దేశాలకు నష్టం కలిగిస్తోంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారిలో యూరోపియన్లు, అమెరికన్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక అత్యధిక కరోనా మరణాలు ఇటలీలో నమోదయ్యాయి. అలాగే ఇప్ప‌టికే ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. ఒక్క ఐరోపా ఖండంలోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌పంచ‌దేశాలు నానా ఇబ్బందులు ప‌డుతోంది.

 

ఇలాంటి స‌మ‌యంతో.. మ‌రో కొత్త విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. తాజా పరిశోధన ప్ర‌కారం.. బాల్యంలో బీసీజీ టీకా వేయించుకున్నవారికి కరోనా ముప్పు తక్కువని అంటున్నారు. ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉండడానికి... చైనా, భారత్ వంటి దేశాల్లో తక్కువగా ఉండడానికి కారణం బీసీజీ టీకాయేనంటూ పరిశోధకులు చెబుతున్నారు. బీసీజి, టీబీ అంటే క్షయ వ్యాధి నివారణ కోసం ఇచ్చే టీకా. భారతదేశంలో బీసీజీ టీకా వేసుకోని వారు దాదాపుగా ఉండరు. ప్రభుత్వం బిడ్డ పుట్టిన తర్వాత వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ టీకాను తప్పనిసరి చేసింది. చైనాలో సైతం ఈ టీకాను ఉప‌యోగిస్తున్నారు. 

 

ఈ టీకా కారణంగానే ఆయా దేశాల్లో మరణాల రేటు తక్కువగా ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికీ చాలా దేశాలలో ముఖ్యంగా అమెరికా, ఇటలీ మరియు హాలండ్ వంటి అనేక ధనిక దేశాల్లో బీసీజి టీకా విధానం అంటూ లేదు. అందుకే అక్కడ కరోనా మరణాల రేటు అధికంగా ఉందని అధ్యయనకారులు ప్రస్తావిస్తున్నారు. కాగా, పిల్లల్లో రోగనిరోధకశక్తిని పెంపొందించడమే ఆ టీకాల లక్ష్యం. ఆ విధంగా వేసే టీకాల్లో బీసీజీ వ్యాక్సిన్ కూడా ఒకటి. నవజాత శిశువులను క్షయ వ్యాధి కబళించకుండా ఈ బీసీజీ టీకా రక్షాకవచంలా పనిచేస్తుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: