ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న బీభత్సానికి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది.  అన్ని రంగాలపై ఈ  కరోనా ప్రభావం పడింది.  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది...  ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 161కు చేరింది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎం లతో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన విషయం తెలిసిందే.  

 

ఈ నేపథ్యంలో ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ పరిస్థితుల గురించి క్షుణ్ణంగా వివరించారు.  ఈ నేపథ్యంలో ప్రధాని నరేందర మోడీకి లేఖ రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకసభ పక్షనేత మిథున్ రెడ్డి... ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రికి కూడా ఆయన లేఖలు రాశారు. . ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.  

 

కేంద్ర ప్రభుత్వం తక్షణమే జీడీపీలో 8 నుంచి 10 శాతం వరకు ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీ ప్రకటించాలి అని కోరిన ఎంపీ మిథున్ రెడ్డి ఇక్కడ అన్ని వ్యాపార, పరిశ్రమల రుణాల రికవరీని ఏడాదిపాటు వాయిదా వేయాలని కోరారు.  అంతే కాదు  ద్రవ్య లోటు అధిగమించి డబ్బు ఆర్జించేందుకు ఆర్బీఐతో కలిసి కేంద్ర ప్రభుత్వం చర్యలు  తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ప్రజా ఆరోగ్యం బలోపేతం, “కరోనా వైరస్” కట్టడి చర్యలు, పేదలకు ఆర్థిక సహాయం తదితర చర్యలతో రాష్ట్ర  ఖజానా పై తీవ్ర భారం పడింది అని వారి దృష్టికి తీసుకెళ్లారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: