అమ్మ.. అనే పదం వినగానే కంట్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. పెదవే పలికిన మాటల్లోని  తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ... కంటికి వెలుగమ్మా.. అని ఎవరు  రాసారో గాని వాళ్ళకి వందనాలు. అమ్మ ఉన్నవాళ్లు అదృష్టవంతులు. లేని వాళ్ళు  నిజంగానే  దురదృష్టవంతులు.అమ్మ ప్రేమలోని ఆప్యాయత, అనురాగం పొందలేని జన్మ ఎందుకు !  అమ్మ మాత్రమే తన పిల్లలు ఎలా ఉన్నా,  ఏమి చేసిన, కడుపులో పెట్టుకుని పిల్లలకు  ప్రేమను పంచుతుంది.

 

 

పువ్వు పూస్తే ఎంత అందంగా ఉంటుందో అమ్మా.. అన్న  పిలుపు కూడా అంతే అందంగా ఉంటుంది. బిడ్డల విషయంలో ప్రతి తల్లి ఆలోచన అందరికంటే వేరుగా ఉంటుంది.. మనం రోజంతా పని చేసి ఇంటికి వచ్చాక  మన నాన్న ఎంత పని చేసావు ! అని అడుగుతాడు, భార్య ఎంత సంపాదించావ్ అని అడుగుతుంది, పిల్లలు నాన్న నాకు ఏమి తెచ్చావ్  అని అడుగుతారు,  కానీ అమ్మ మాత్రం ఎరా ఎమన్నా తిన్నావా ! లేదా అని అడుగుతుంది. అదే అమ్మ గొప్పతనం. బిడ్డ ఆకలి చూసేది అమ్మ. మనం బయట అమ్మ కి తెలియకుండా ఎన్నో తింటాము. కానీ అమ్మ మాత్రం  బిడ్డ కోసం తాను ఏది తిన్న కొంచెం దాచి బిడ్డ కోసం కొసరి కొసరి తినిపించేది ఒక్క అమ్మ మాత్రమే.

 

అన్నం కలిపి గోరుముద్దలు కలిపి పెట్టేటప్పుడు తన బిడ్డపై ఉన్న ప్రేమని కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటే బిడ్డ కడుపు నిండుతుందో లేదో తెలియదు గాని ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. ఈ ప్రపంచంలో బిడ్డ  ఎంత దూరంగా ఉన్నా బిడ్డల క్షేమాన్ని కోరుకుంటూ వారు ఎల్లవేళలా బాగుండాలని కోరుకునే ఒకే వ్యక్తి మన అమ్మ.. చివరగా ఒక్క మాట కన్నతల్లి, గుడిలో దేవుడి ఇద్దరు ఒక్కటే.. వాళ్ళ దగ్గరకి మనమే వెళ్లి చూడాలి, కానీ వాళ్ళు మనదగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం. మన కోసం  ఇంత దేవత లాంటి మాతృమూర్తి  పాదాలకు శతకోటి వందనాలు.. !

మరింత సమాచారం తెలుసుకోండి: