ఓ వైపు కరోనాని కట్టడి చేయడానికి ఎంత కష్టపడుతున్నో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది కొంతమంది చేస్తున్న మూర్ఖపు పనుల వల్ల వేల మందికి కరోనా వ్యాప్తి చెందితుంది.  తాజాగా  గుంటూరు ఐటీసీ సమీపంలో ఓ బిర్యానీ హూటలలో జరిగిన దారుణం వెలుగు లోకి వచ్చింది.  ముగ్గురు కరోనా అనుమానితులు, ఆసుపత్రికి తరలింపు.  హోటల్ వెనుక నివాసం ఉంటున్న వ్యక్తికి కరోనా పాజిటీవ్. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్లు గుర్తింపు. మూడు రోజుల నుంచి హూటల్ వెనుక నుంచి పార్సిల్ అందించినట్లు సమాచారం. 

 

ఈ విషయం తెలిసి ఆందోళనలో బిర్యానీ పార్సిల్ తీసుకు వెళ్లిన సిబ్బంది. ఇప్పుడు ఎంత మంది పార్సిల్లు తీసుకు వెళ్లారు.. వారిని గుర్తించే కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.  ఓ వైపు లాక్ డౌన్ చేస్తున్నప్పటికీ కొంత మంది ఇలా ఉల్లంఘన చేస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పోలీసులు అధికారులు అంటున్నారు.

 

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకీ పెరిగిపోతుందని.. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 161కు చేరింది.

 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple 

మరింత సమాచారం తెలుసుకోండి: