లాక్ డౌన్ పాటించ‌మ‌ని దేశ‌వ్యాప్తంగా స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీయే చేతులు జోడించి ప‌దే ప‌దే ద‌ణ్ణాలు పెడుతున్నా చాలా మంది మాత్రం ఇవేవి ప‌ట్టించుకోవడం లేదు. ఇక చాలా మంది క‌రోనా అనుమానితులు సైతం క్వారంటైన్ నుంచి త‌ప్పించుకుంటోన్న సంఘ‌ట‌న‌లు మ‌నం చూస్తూనే ఉన్నాం. త‌మిళ‌నాడులో క్వారంటైన్‌లో ఉన్న ఓ వ్య‌క్తి ఏకంగా త‌న ప్రియురాలితో స‌హా జంప్ అయ్యారు. అత‌డిని పట్టుకునేందుకు పోలీసులు ప‌డిన క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. 

 

ఇక ఇప్పుడు ఏపీలో క‌రోనా అనుమానితుడు ఒక‌రు ప‌రారు కావ‌డం స‌చంలనంగా మారింది. ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో క‌రోనా వైర‌స్ కోర‌లు చాస్తోంది. ఇప్ప‌టికే ఈ జిల్లాలో ఏకంగా 17 మందికి క‌రోనా సోకింది. తాజాగా ఒంగోలులో ఐసోలేషన్ వార్డులో ఉన్న వ్యక్తి శుక్రవారం ఉదయం కనిపించకుండా పోయాడు. అతడు ఎక్కడికెళ్లాడో క్లారిటీ లేకుండా పోయింది. ఐసోలేష‌న్ వార్డు నుంచి అత‌డు త‌ప్పించుకుపోవ‌డంతో అధికారులు, పోలీసులు గాలింంపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. 

 

ఇక ఐసోలేష‌న్ వార్డు నుంచి పారిపోయిన వ్య‌క్తికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని సందేహాలు ఉన్నాయి. అతడికి ఫోన్ చేసినా కలవడం లేదని అధికారులు చెబుతున్నారు. పరారైన వ్యక్తి ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. అత‌డికి క‌రోనా ల‌క్ష‌ణాల నేప‌థ్యంలో బ్ల‌డ్ శాంపుల్స్ సేక‌రించి ర‌క్త న‌మూనాలు ల్యాబ్‌కు పంపారు. ఇక అదే జిల్లాలోని ఒంగోలు రిమ్స్‌లో కూడా కొద్దిరోజుల క్రితం కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడ్ని వెంటనే గమనించిన ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని వార్డుకు తరలించారు. మళ్లీ మరో వ్యక్తి పారిపోవడం సంచలనంగా మారింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: