దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరూ కరోనా విజృంభిస్తూ ఉండటంతో తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే సమయంలో సోషల్, వెబ్ మీడియాలో కరోనా గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవాల కంటే అవాస్తవాలే ఎక్కువగా ఉండటం గమనార్హం. గత కొన్ని రోజులుగా తాగునీటి పైపుల ద్వారా కరోనా సంక్రమిస్తుందని... నల్లాల్లో వచ్చే నీటిని ప్రజలెవ్వరూ తాగొద్దనే వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. 
 
కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (who) స్పందించింది. కరోనా నీటి పైపుల ద్వారా సోకుతుందని చెప్పటానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటన చేసింది. ప్రజలు నల్లా నీటి ద్వారా కరోనా సోకుతుందని భయాందోళనకు గురి కావద్దని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ లో నమోదవుతున్న కేసులకు, నల్లా నీళ్లకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేసింది. 
 
డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిఖ్ లాజరెవిచ్ కరోనా వైరస్ ఒక మనిషిని ఒక మనిషిని తాకడం, కరోనా రోగులను తాకిన వస్తువులను ముట్టుకోవడం ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. గాలి ద్వారా, నల్లా నీళ్ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోను వైరస్ వ్యాప్తి చెందదని... సామాజిక దూరం పాటించటం, ముఖ భాగాలను తాకకపోవడం కరోనాను నియంత్రిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. 
 
కరోనా వైరస్ ప్రబలకుండా ఉండాలంటే మనిషికి మనిషికి మధ్య ఒక మీటర్ దూరం కచ్చితంగా ఉండాలని సూచించారు. మరోవైపు సోషల్ మీడియాలో కరోనా గురించి వదంతులు వైరల్ అవుతూ ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్తలు వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యాయి. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న కొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: