కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాలు కకావికలం అవుతున్నాయి. ఈ ర‌క్క‌సిని నిరోధించే మందు లేకపోవడంతో.. వైరస్‌ వ్యాప్తి కట్టడికి ప్రపంచం మొత్తం నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు, సూచనలు చేస్తున్నాయి. అయితే ఇప్ప‌టికే  ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్యప‌ది ల‌క్ష‌లు దాటింది. మ‌రియు ఈ వైర‌స్‌ కారణంగా 187 దేశాల్లో 53 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

 

ప్ర‌స్తుతం ఈ లెక్క‌లు చూస్తుంటే.. ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇదిలా ఉంటే..  కరోనా వైరస్‌ చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సిక్లోరోక్వైన్‌, యాంటీ బయోటిక్‌ అజిత్రో మైసిన్‌లు రోగి హృదయ స్పందనలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని యూఎస్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే ఈ మలేరియా యాంటీ బయోటిక్‌ డ్రగ్‌ కాంబినేషన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌కు దారి తీస్తుందని వారు తాజాగా వెల్ల‌డించారు. అంతేకాకుండా  కాంబినేషన్‌ డ్రగ్‌ల కారణంగా అనారోగ్యంతో ఉన్న వారి పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందంటున్నారు.  

 

ఈ నేప‌థ్యంలోనే ఆరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్శిటీ ఫ్రొఫెసర్‌ ఎరిక్‌ స్టెకర్‌ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వైద్యులు క‌రోనా చికిత్స‌లో భాగంగా హైడ్రాక్సిక్లోరోక్వైన్‌, యాంటీ బయోటిక్‌ అజిత్రో మైసిన్‌లు ఉప‌యోగిస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్‌ను వాడుతున్న వారు దాని ద్వారా ఎదురయ్యే దుష్ప్రభావాలపై తప్పకుండా జాగ్రత్త వహించాలి. ఈ కాంబినేషన్‌తో చికిత్స చేస్తున్నవారు బాధితుల హృదయ స్పందనలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి అంటూ హెచ్చ‌రించారు. కాగా, క‌రోనా వైర‌స్ రోజురోజుకు విజృభిస్తుంది. అయితే ప్ర‌స్తుతం దీనికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి నివార‌ణ‌పైనే దృష్టి పెట్టారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: