కరోనా రక్కసి దెబ్బకు ప్రపంచం కకావికలమౌతుంది.. రోజు రోజుకీ పెరిగిపోతున్న బాధితుల సంఖ్య చూస్తే... గుండెలు బాదుకు చావాల్సిందే. ఇటీవల జరిగిన వలస కార్మికుల ఉదంతాలు వింటే, నిజంగానే గుండె ఆగిన పరిస్థితి... వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస జీవులు, లాక్ డౌన్ నేపథ్యంలో.. వున్న చోట ఇమడలేక..  వేరే దారిలేక, సొంత ఊళ్లకు..  కాలి నడకన కొన్ని వందల మైళ్ళు ప్రయాణించి.. ప్రయాణించి... గుండెపోటుతో ఒకరు, డి హైడ్రేషన్ తో మరొకరు... చనిపోయిన హృదయవిదారక సంఘటనలు మనం చూశాం... చూస్తున్నాం..

 

సదరు బాధితుల చావులు యెంత భయానకంగా వున్నాయంటే, అందరు వున్నా... చుట్టూ ఎవరూ లేని పరిస్థితులలో అనాధలుగా తనువులు చాలించారు... ఇక మహమ్మారి కరోనాకు ప్రపంచం అల్ల కల్లోలం అవుతుంది అనడం అతిశయోక్తి కాదేమో. కరోనా బాధితుల మరణాలు గురించి అందరికి తెలిసినదే... వారి డెడ్ బాడీలను కన్న తల్లిదండ్రులు కూడా ముట్టుకోలేని పరిస్థితి... 

 

ఇక పొతే, ఏపీలో గత మూడు.. నాలుగు రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం అందరికి తెలిసినదే. అలాగే... రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం, ఢిల్లీలో జరిగిన ముస్లిం మత సమ్మేళనం.. "తబ్లీగి జమాత్"కు వెళ్లి వచ్చిన వారివేనని కూడా అందరికి విదితమే.. ప్రస్తుతం పెరిగిన కేసులను రాష్ట్ర, జిల్లాల వారీగా చూసుకుంటే... క్రింది విధంగా వుంది.   
 

ప్రపంచలో మొత్తం కేసులు: 1030199
మరణాలు: 54198
రికవరీ కేసులు: 219837

 

ఇండియాలో మొత్తం కేసులు: 2567 
మరణాలు: 72 
కొత్త కేసులు: 24
రికవరీ కేసులు: 192 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 154
యాక్టివ్ కేసులు: 103
మృతులు: 9 
ఏపీలో మొత్తం కేసులు: 161
మృతులు: 1

 

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
నెల్లూరు: 32
కృష్ణా: 23
గుంటూరు: 20
కడప: 19
ప్రకాశం: 17 
పశ్చిమ గోదావరి: 15
విశాఖపట్నం: 14
తూర్పు గోదావరి: 9  
చిత్తూరు: 9 
అనంతపురం: 2 
కర్నూలు: 1

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: