దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ చేపట్టారు.  దేశ వ్యాప్తంగా కరోనా సంఖ్య పెరుగుతూ ఉంది. ఏపీలో ఇప్పటి వరకు 161 పాజిటివ్ కేసులు నమోదు  అయిన విషయం తెలిసిందే.  రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.  ఈ సమయంలో ఎవరూ బయటకు వెళ్లకుండా గట్టి ఏర్పాటు చేస్తున్నారు.  అత్యవరసర పరిస్థితుల్లో తప్ప బయటకు ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదని ఆంక్షలు పెట్టారు.  అయినా కొంత మంది రోడ్లపైకి వస్తే వారికి పోలీసులు లాఠీలతో బడితె పూజ చేస్తున్న విషయం తెలిసిందే.  

 

ఈ నేపథ్యంలో ఓబాధ్యత గల ఎమ్మెల్యే పది మందికి చెప్పాల్సిన వ్యక్తి ఆయనే ఇప్పుడు లాక్ డౌన్ ఉల్లంఘన చేసి తీవ్ర విమర్శల పాలు అవుతున్నారు.  వివరాల్లోకి వెళితే.. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ నియోజకవర్గంలో ఓ కల్వర్లు ఏర్పాటు చేయగా తన అనుచరగణం, స్థానికులతో వెళ్లి అట్టహాసంగా ఆ నిర్మాణానికి అధికారికంగా ప్రారంభోత్సవం చేశారు.  

 

ఈ కార్యక్రమంలో ఆయన మద్దతుదారులు, స్థానికులు పాల్గొన్నారు.. అయితే కనీస సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా ఒకే దగ్గరకు రావడం.. ముఖానికి కనీసం మాస్కులు కూడా కొంత మంది ధరించకపోవడం ఎంత వరకు సమంజసం అంటున్నారు. కాగా, ఎమ్మెల్యే తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: