యాంటీ మలేరియా డ్రగయినా ‘హైడ్రోక్సిక్లోరోక్విన్‌’ తీసుకున్న ఓ డాక్టర్ మృతిచెందాడు. ఈ సంఘ‌ట‌న గౌహ‌తిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జ‌రిగింది. బ‌ర్మ‌న్ అనే డాక్ట‌ర్ గౌహ‌తిలోనే ఓ ఆస్ప‌త్రిలో అనస్థియాలజిస్ట్‌గా ప‌నిచేస్తున్నాడు. అస్సాంకు చెందిన ఆయ‌న వ‌య‌స్సు 44 ఏళ్లు .  క‌రోనా ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా యాంటీ మ‌లేరియా డ్ర‌గ్ తీసుకోవ‌చ్చ‌ని భార‌త్ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కరోనా వైరస్‌ నిర్ధారిత రోగులు లేదా కరోనా రోగులకు వైద్యం చేయడం ద్వారా కరోనా బారిన పడే అవకాశం ఉందని భావించిన వారు ఈ ‘హైడ్రోక్సిక్లోరోక్విన్‌’ను తీసుకోవాల్సిందిగా భారత వైద్య పరిశోధనా మండలి సూచించింది.

 

ఈ ప్ర‌క‌ట‌న‌తో అంద‌రిలాగ‌నే బ‌ర్మ‌న్ కూడా ముంద‌స్తుగా ఈ డ్రంగ్ వాడాడు. అయితే డ్రంగ్ తీసుకున్న నాటి నుంచి ఆయ‌న శ‌రీరంలో మార్పులు చోటుచేసుకోవ‌డం గ‌మ‌నించాడు. ‘కరోనా వైరస్‌ నివారణకు హైడ్రోక్సిక్లోరోక్విన్‌ సరైన మందు కాదు. నేను దీన్ని తీసుకున్న తర్వాత నాకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి’ అని ఆదివారం మధ్యాహ్నం బ‌ర్మ‌న్ త‌న స‌హ‌చ‌ర వైద్యుల‌కు మెస్సేజ్ పెట్టారు. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన రెండు గంట‌ల త‌ర్వాత బ‌ర్మ‌న్ భార్య బర్మన్‌ సహచర వైద్యులకు ఫోన్‌చేసి ఆయనకు గుండెపోటు వ‌చ్చింద‌ని తెల‌ప‌డం, వారు వెంట‌నే ఇంటికి చేరుకుని ఆస్ప‌త్రికి చేర్చి వైద్యం అందిస్తుండ‌గా మ‌ర‌ణించారు.

 

 అస‌లు బ‌ర్మ‌న్ ఎందుకు డ్రంగ్ తీసుకోవాల్సి వ‌చ్చింద‌నే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. భారత వైద్య పరిశోధనా మండలి సిఫార్సు మేరకు యాంటీ మలేరియా డ్రగయినా ‘హైడ్రోక్సిక్లోరోక్విన్‌’ తీసుకోవడంతో మరణించినట్లు ఆయన సహచర వైద్యులు ఆరోపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా బర్మన్‌ పని చస్తోన్న ఆస్పత్రిలో కరోనా వైరస్‌ సోకిన రోగులు ఎవరూ చేరలేదని, అలాంటప్పుడు ముందు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన యాంటీ మలేరియా డ్రగ్‌ను ఆయన ఎందుకు తీసుకున్నారో అర్థం కావడంలేదని సహచర వైద్య సిబ్బంది తెలిపారు. తమకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం బర్మన్‌ది గుండెపోటు వచ్చే వయస్సు కాదని, యాంటి మలేరియా డ్రగ్‌ తీసుకోవడం వల్లనే ఆయన మత్యువు బారిన పడ్డారని సహచర వైద్యులు పేర్కొంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: