కరోన కరడు కట్టిన కాలాంతకి. దానికి దయా దాక్షీణ్యాలు అసలు లేనే లేవు. ఖర్మ కాలి దొరికితే దాని పదఘట్టనల కింద నలిగిపోవడమే తప్ప వేరే గతి లేదు. అది పేద అయినా పెద్ద అయినా తేడా పాడా లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది కరోనా.

 

కరోనా కాఠిన్యానికి ఇపుడు అగ్రరాజ్యం విలవిలలాడుతోంది. ఒక రకంగా కాదు, కూశాలు కదిలించేస్తోంది. మొదట్లో  అమెరికా చేసిన నిర్లక్ష్యానికి ఇపుడు గట్టి ప్రతిఫలం చెల్లించుకుంటోంది. ఇప్పటికే లక్షల్లో అక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజా లెక్కలా ప్రకారం చూసినా ఇప్పుడు అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.45 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 6059గా నమోదైంది. ఇది ఇక్కడిక్తో ఆగిపోదని అమెరికా పెద్దలు ఆందోళన చెందుతున్నారు.

 

కరోనా మరణాలు లక్షకు పైగా ఉంటాయని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సమయంలో ఒక ఆసక్తి కలిగించే వార్త బయటకు వచ్చింది. అదేంటి అంటే ఒకవేళ అమెరికాలో లక్ష మంది దాకా కరోనా కారణంగా చనిపోతే ఆయా మృతదేహాలను ఉంచేందుకు లక్ష బాడీ బ్యాగులు కావాలంటూ ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ (ఫెమా) అమెరికా సైనిక విభాగాన్ని కోరడం తీవ్ర కలకలం రేపుతోంది. పెంటగాన్ వర్గాలు కూడా దీన్ని ధ్రువీకరించాయి

 

ఇవన్నీ ఇల్లా ఉంచితే నిన్న ఒక్క రోజే 1100 మంది దాకా కరోనా కారణంగా మరణించారు. ఇది చాలు కరోనా అక్కడ ఎంతలా ప్రళయం స్రుష్టిస్తొందో. ఇక కరోనా మరణాలు ఈ దూకుడు చూస్తూంటే లక్షతో కూడా ఆగుతాయని చెప్పలేమని కూడా వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయట. కనీసంగా రెండు లక్షల మరణాలు చోటు చేసుకుంటాయని కూడా అంచనాలు వేస్తున్నారట. ఈ వార్తలు అన్నీ వింటూంటే అమెరికాను చుట్ట చుట్టేసి కట్ట కట్టేసేలా కరోనా ఉందన్న సత్యం మాత్రం అర్ధమవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: