కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశమంతటా లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కనీసం మరో పది రోజుల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చని కూడా చెబుతున్నారు. ఈ లాక్ డౌన్ ప్రభావంతో అన్ని రకాల బిజినెస్‌ లు దెబ్బ తిన్నాయి. కానీ మీడియాలో న్యూస్ ఛానళ్లు మాత్రం పండుగ చేసుకుంటున్నాయి.

 

 

కరోనా వైరస్ ప్రభావంతో గతంలో ఎన్నడూ లేనంతగా జనం న్యూస్ చూస్తున్నారు. ఎంతగా అంటే చివరకు కార్తీక దీపం వంటి పాపులర్ టీవీ సీరియళ్ల రేటింగులను కూడా న్యూస్ ఛానళ్లు దాటేస్తున్నాయి. ఉదాహరణకు గత వారం టాప్ రేటింగ్ వచ్చిన 30 తెలుగు ప్రోగ్రాముల్లో ఈటీవీ న్యూస్ 9 పీఎం బులెటిన్ పలుసార్లు చోటు చేసుకుంది. ఈటీవీలో (ఈటీవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛానళ్లు కాదు ‌) వచ్చే 9 గంటల న్యూస్ బులెటిన్ కు మొదటి నుంచి ఆదరణ ఎక్కువే.

 

 

న్యూస్ అంటే ఆసక్తి ఉన్నవాళ్లు.. గంటల తరబడి రెగ్యులర్ న్యూస్ ఛానళ్లలో వచ్చే రొటీన్ సాగతీసే వార్తలు చూడలేని వాళ్లకు ఈ బులెటిన్ ఓ వరప్రసాదిని అనే చెప్పాలి.. సరిగ్గా అరగటంలో ప్రపంచంలోని అన్ని ముఖ్యమైన విశేషాలు అందించడం దీని ప్రత్యేకత. ఈ బులెటిన్ చూస్తే చాలు ఇవ్వాళ్టి న్యూస్ అప్‌ డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు అన్న భరోసా వల్లే దీనికి ఇంత ఆదరణ ఉంటోంది.

 

 

ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఆ ఆదరణ మరింత పెరిగింది.. ఎంతగా అంటే చివరకు కార్తీక దీపం సీరియస్ టీఆర్పీలను సైతం ఈటీవీ 9 గంటల బులెటిన్ దాటేసిందంటే.. అర్థం చేసుకోవచ్చు. గత వారం టాప్ 10 ఎంటర్‌టైన్‌ మెంట్‌ ప్రోగ్రాముల్లో కార్తీక దీపం 5 స్థానాలు దక్కించుకుంటే.. ఈటీవీ న్యూస్ 9 గంటల బులెటిన్‌ 2 స్థానాలు దక్కించుకుంది మరి. కార్తీక దీపంతో పోటీ పడటం అదీ న్యూస్ ఛానల్ అంటే మామూలు విషయమా మరి.

 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: