కరోనావైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్ప‌టికే ఈ వైర‌స్ దెబ్బ‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా 10.30 ల‌క్ష‌ల మంది బాధితులు ఉన్నారు. ఇప్ప‌టికే 54 వేల మంది చ‌నిపోయారు. ఈ ప్ర‌భావం భార‌త్‌లో రోజు రోజుకు తీవ్ర‌మ‌వుతోంది. ఇక మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా కుప్ప‌కూలేలా ఉంది. మ‌న‌దేశంలో ఆర్థిక‌, రాజ‌కీయ‌. చారిత్ర‌క వ్య‌వ‌స్థ‌లో గంగాన‌దికి ఎలాంటి ప్రాముఖ్యం ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. గంగాన‌దికి మ‌న దేశానికి శ‌తాబ్దాలుగా అవినాభావ సంబంధం ఉన్న సంగ‌తి తెలిసిందే.

 

అయితే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా గంగాన‌దిలో కాలుష్య తీవ్ర‌త బాగా పెరిగిపోతోంది. ప‌రిశ్ర‌మ‌లు పెరిగిపోవ‌డంతో పాటు ప్ర‌జ‌లు వాడిన నీళ్లు అన్ని న‌దిలో క‌ల‌వ‌డంతో గంగ మురికి కూపంగా మారిపోతోంది. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇతర పరిశ్రమలు నడవకపోవడంతో నదీలోకి వ్యర్థాలు చేరడం బాగా తగ్గిందని నిపుణులు, పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్ర‌మ‌ణ మండ‌లి లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌స్తుత చాలా చోట్ల గంగాన‌దిలో స్నానం చేసేందుకు కూడా నీరు అనువుగా ఉంద‌ట‌.

 

నదికి 36 చోట్ల పర్యవేక్షణ విభాగాలు ఉండగా 27 ప్రాంతాల్లో నీరు స్వచ్ఛంగా ఉంది. జలచరాలు సంచరించేందుకు, జీవించేందుకు యోగ్యంగా మారింది. నీటిలో కరిగిన ప్రాణవాయువు (లీటరుకు 6 మి.గ్రా కన్నా ఎక్కువ), జీవరసాయన ప్రాణవాయువు (లీటరుకు 2 మి.గ్రా. కన్నా తక్కువ), మొత్తం కోలిఫామ్‌ స్థాయిలు (100 మి.లీ.కు 5000), పీహెచ్‌ (6.5-8.5) పరామితులను అనుసరించి నదుల ఆరోగ్యాన్ని కొలుస్తారు. గంగా ఉపనదులైన హిందో, యమున (జమున) నదుల్లోనూ స్వచ్ఛత పెరిగింది. ఇక గంగ‌లో ప్ర‌స్తుతం రూపాయి బిల్ల వేసినా ఎంత కింద‌కు వెళ్లినా కూడా క‌నిపించేంత స్వ‌చ్ఛ‌త వ‌చ్చింద‌ట‌.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: