అగ్ర‌రాజ్యం అమెరికాను కంటికి క‌నిపించ‌ని సూక్ష్మ‌క్రిమి వ‌ణికిస్తోంది. ఆ మాట‌కొస్తే భూ మండ‌లంపై క‌రోనా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. రోజూ వేలాది మంది ప్రాణాలు గాలిలో క‌లిసి పోతున్నాయి. ల‌క్ష‌లాది మందికి క‌రోనా పాజిటివ్ వ‌స్తోంది. తుంచే కొద్దీ..బ‌లాన్ని పెంచుకుంటూ ప్ర‌పంచ‌దేశాల‌న్నిటిలోనూ విస్తరించేసింది ఈ ర‌క్క‌సి. శుక్రవారం మధ్యాహ్నానికి ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 బాధితుల సంఖ్య పది లక్షలు దాటేసింది. రెండు లక్షల మందికి నయమవ్వగా 53వేల మందికి పైగా మృతిచెందిన‌ట్లు ప్ర‌పంంచ ఆరోగ్య సంస్థ లెక్క‌లు వెల్ల‌డించింది. క‌రోనా దెబ్బ‌కు అమెరికా అత‌లాకుత‌లం అవుతోంది. భారత్‌లో 2,088 కేసులు నమోదవ‌గా 156 మంది ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు.

 

 అయితే  56 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, స్పెయిన్‌, బ్రిటన్‌లో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  వైరస్‌తో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 4.1 ట్రిలియన్‌ డాలర్లు అంటే ప్రపంచ ఉత్పత్తిలో ఐదు శాతం తగ్గుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు శుక్రవారం హెచ్చరించ‌డం గ‌మ‌నార్హం. అలాగే అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు 30 శాతం వరకు పతనమవుతాయని రేటింగ్‌ సంస్థ ఫిచ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన‌డంతో ఐరోపా దేశాలు ఇప్పుడు మ‌రింత వ‌ణికిపోతున్నాయి.  ప్ర‌ప‌చంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నాయి. దీంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ప‌త‌న‌మ‌య్యాయి. మరికొన్ని రోజులు ఇలానే ఉంటే ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చుతుంద‌ని  ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

క‌రోనా బారిన ప‌డి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య‌లో పావు వంతు అమెరిక‌న్ల‌దే కావ‌డం విషాద‌క‌ర‌మైన విష‌యం. ఇప్పటికే 6000కు పైగా మృతిచెందారు. లక్ష నుంచి రెండున్నర లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని అమెరికా వైద్య వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్న‌ట్లు స‌మాచారం.  ఆ మృత‌దేహాల‌ను త‌ర‌లించేందుకు వీలుగా ముంద‌స్తుగా లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ ‘ఫెమా’ ఆ దేశ సైన్యానికి సూచించ‌డం గ‌మ‌నార్హం.  ఇప్పుడు ఈ వార్త ఆదేశ ప్ర‌జ‌ల‌ను వ‌ణికిపోయేలా చేస్తోంది. చూడాలి ఏం జ‌రుగుతుందో అమెరికాలో..

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: