మొన్నటి వరకూ కరోనా బాధితుల సంఖ్య, మన ఏపీలో కంటే, తెలంగాణాలోనే ఎక్కువ ఉందన్న సంగతి అందరికి తెలిసినదే. ఇక రాష్ట్ర ప్రజలు అంతా... మన దగ్గర కరోనా ప్రభావం ఏమంత లేదు.. అన్న ధీమాతో వ్యవహరించిన తరుణంలో.... గడిచిన 3 రోజులలో రెట్టింపు అయిన కేసులు అందరిని నివ్వెర పోయేలా చేస్తున్నాయి. ఇక్కడ రాను రాను పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగిపోతుంది.

 

ఇక తాజా లెక్కల ప్రకారం, కరోనా బాధితుల సంఖ్య 161కు చేరుకుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమంటే... ఈ కేసుల్లో కూడా ఎక్కువ మంది... ఢిల్లీ ప్రార్థలనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులే ఉండటం ఘోరమైన విషయం...  ఇక ఈ 161 కేసులలో ఢిల్లీతో లింకులు వున్న కేసులు 140 ఉండటం కొసమెరుపు. తబ్లీగి ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో ఎక్కువమందికి కరోనా వైరస్ సోకడంతో.. అక్కడికి వెళ్లొచ్చిన వారిపై ఏపీ ప్రభుత్వం నిఘా పెట్టింది.

 

ఇక కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న తరుణంలో కొందరు ఆకతాయిలు... బాధ్యత లేనివాళ్లు లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. వీళ్ళను ఉద్దేశించి.... ఇటీవల మోడీ ప్రస్తావిస్తూ.... లాక్ డౌన్ ఉల్లంఘన చర్యలకు పాల్పడిన వారికి 2 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తామని హెచ్చరికలు జారీ చేసారు... ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసులను చూసుకంటే...
 

ప్రపంచలో మొత్తం కేసులు: 10, 30, 570
మరణాలు: 54, 226
రికవరీ కేసులు: 2, 20, 031

 

ఇండియాలో మొత్తం కేసులు: 2, 567 
మరణాలు: 72 
కొత్త కేసులు: 24
రికవరీ కేసులు: 192 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 154
యాక్టివ్ కేసులు: 103
మృతులు: 9 
ఏపీలో మొత్తం కేసులు: 161
మృతులు: 1

 

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
నెల్లూరు: 32
కృష్ణా: 23
గుంటూరు: 20
కడప: 19
ప్రకాశం: 17 
పశ్చిమ గోదావరి: 15
విశాఖపట్నం: 14
తూర్పు గోదావరి: 9  
చిత్తూరు: 9 
అనంతపురం: 2 
కర్నూలు: 1

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: